సర్జున్ కేఎం దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో నటించిన హారర్ సినిమా ఐరా. తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో కళయరసన్, యోగి బాబు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై కొటపడి జే రాజేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. మళ్లీ ఆడపిల్లే పుట్టిందిరా అనే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం ఒకింత సస్పెన్స్‌కి గురిచేసేలా వుంది. ఈ టీజర్‌లో హారర్ టచ్ ఇచ్చే పలు సీన్స్‌, డైలాగ్స్‌ని విడుదల చేసిన మేకర్స్... తద్వారా సినిమాపై అంచనాలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. థింక్ మ్యూజిక్ ఇండియా యూట్యూబ్ ఛానెల్ ద్వారా మేకర్స్ విడుదల చేసిన ఆ టీజర్ ఇదే.