పొరపాటున ట్విట్టర్ లో  తన భార్య, నటి కాజోల్ మొబైల్ నంబరును షేర్ చేశాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్.... అంతే  నిమిషాల వ్యవధిలో ఆ ట్వీట్ వైరల్ అయింది. వేల మంది ఈ ట్వీట్ ను వాచ్ చేశారు... వందల మంది కాజోల్ కు మెసేజ్ చేయడం ప్రారంభించారు. పొరపాటును గమనించిన అజయ్ దేవ్ గన్  'ప్రాంక్' అని వివరణ ఇచ్చినా వినని అభిమానులు వాట్స్ యాప్ లో మెసేజ్ మీద మెసేజ్ చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని అజయ్ దేవగన్ తలపట్టుకొని కూర్చున్నాడట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అజయ్ దేవగన్ ఏమని ట్వీట్ చేశాడంటే :  'కాజోల్ ప్రస్తుతం ఇండియాలో లేదు... ఆమెను వాట్స్ యాప్ నంబర్ లో సంప్రదించి సమన్వయం చేసుకో' అని ఎవరికో పెట్టాల్సిన మెసేజ్ ని అందరికీ కనిపించేలా ట్విట్టర్ లో పెట్టాడు..


[[{"fid":"174473","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]