అల వైకుంఠపురములో సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి మూవీ యూనిట్ మస్తు ఖుషీ అవుతోంది. మీడియాలో వస్తోన్న కథనాల ప్రకారం తెలంగాణ, ఏపీలో అల వైకుంఠపురములో మూవీ బాక్సాఫీస్ రీపోర్టు బాగుందని తెలుస్తోంది. తక్కువ థియేటర్లతోనే ఎక్కువ వసూళ్లు రాబట్టిందని మూవీ యూనిట్ సభ్యులు సైతం ఖుషీ అవుతున్నట్టు సమాచారం. మీడియా కథనాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో అల వైకుంఠపురములో సినిమా తొలి రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నైజాం : రూ 6.01 కోట్లు 
సీడెడ్: రూ 4.02 కోట్లు 
ఉత్తరాంధ్ర: రూ 2.87 కోట్లు 
తూర్పు గోదావరి: రూ 2.98 కోట్లు 
పశ్చిమ గోదావరి: రూ 2.41 కోట్లు 
గుంటూరు: రూ 3.41 కోట్లు 
కృష్ణా: రూ 2.57 కోట్లు 
నెల్లూరు: రూ 1.29 కోట్లు 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి మొత్తం : రూ 25.56 కోట్లు


కేవలం రెండు రాష్ట్రాల్లోని తొలి రోజు వసూళ్లే ఇలా ఉంటే.. ఇతర ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌ వసూళ్లు కూడా కలుపుకుంటే.. అది ఇంకా ఎక్కువే ఉంటుందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.