Ala Vaikuntapurramloo teaser | అంచనాలు పెంచిన అల వైకుంఠపురములో టీజర్
అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అల వైకుంఠపురములో టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజైంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌పై అభిమానులు పెట్టుకున్న ఆశలకు, అంచనాలకు అనుగుణంగానే టీజర్ ఉంది. ఎక్కడా స్టోరీ గురించి తెలియనీయకుండా పక్కాగా టీజర్‌ను కట్ చేశారు.
మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కా.. ఇదీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా అల వైకుంఠపురములో టీజర్‌లో స్టైలిష్ స్టార్ చెప్పిన పంచ్ డైలాగ్. అవును.. అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అల వైకుంఠపురములో టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజైంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌పై అభిమానులు పెట్టుకున్న ఆశలకు, అంచనాలకు అనుగుణంగానే టీజర్ ఉంది. ఎక్కడా స్టోరీ గురించి తెలియనీయకుండా పక్కాగా టీజర్‌ను కట్ చేశారు. దీంతో అసలు ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఉత్కంఠ, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు అభిమానులను అలరిస్తుండగా తాజాగా విడుదలైన టీజర్ అభిమానుల హైప్‌ను మరింత రెట్టింపు చేస్తూ దూసుకుపోతోంది.
అల వైకుంఠపురములో.. సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా నాగార్జున మేనల్లుడు సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో బన్నీ సరసన పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. త్రివిక్రమ్, బన్నీ కలయికలో వచ్చిన జులాయి, s/o సత్యమూర్తి చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో వారిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. హారిక హాసిని సంస్థతో కలిసి గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ఆడియెన్స్ ముందుకు రానుంది. అల వైకుంఠపురములో ఏముందో తెలియాలంటే.. సంక్రాంతి వరకు వేచిచూడాల్సిందే.