దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉద్యమం ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అనేక మంది మహిళలు.. వారి స్థాయితో సంబంధం లేకుండా ముందుకువస్తున్నారు. సినిమా పరిశ్రమ నుండి ఇతర రంగాల్లోకి.. చివరికి రాజకీయాల వరకు మీటూ ఉద్యమం వ్యాపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర సహాయమంత్రి ఎంజే అక్బర్ తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, తనపై జర్నలిస్ట్ చేసిన ఆరోపణలను రుజువు చేయాలని, ఆమె తప్పుడు ఆరోపణలు చేశారంటూ సోమవారం క్రిమినల్‌ డిఫమేషన్‌ నమోదు చేశారు. మంత్రి తరఫున లాయర్ కరంజవాలా ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టులో ఈ కేసు వేశారు.  


మరోవైపు బాలీవుడ్ నటుడు అలోక్‌నాథ్‌పై రచయిత్రి, నిర్మాత వింతా నందా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను ఖండించిన అలోక్‌నాథ్ నందాపై సోమవారం కేసు వేశారు. ఆమెపై ఒక్క రూపాయి పరువునష్టం దావా వేశారు అలోక్‌నాథ్. రాతపూర్వకంగా క్షమాపణలు కూడా చెప్పాలన్నారు. తన పరువుకు భంగం కలిగించినందుకు రూ.1 నష్టపరిహారం చెల్లించాలంటూ లాయర్ ద్వారా నోటీసు పంపారు.  


19 ఏళ్ల క్రితం తనపై నటుడు అలోక్‌ నాథ్ అత్యాచారం చేశారని వింతా నందా ఆరోపించారు. తర్వాత సంధ్య మృదుల్, దీపిక అమీన్ అనే మహిళలు కూడా ఆయనపై ఇదే తరహా లైంగిక ఆరోపణలు చేశారు.


బాలీవుడ్ నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, డైరెక్టర్లు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తమను లైంగికంగా వేధించారని ఇటీవల పలువురు మహిళలు ఆరోపించిన సంగతి తెలిసిందే.