Work from home : వాళ్లకు అక్టోబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్
లాక్ డౌన్ ( Lockdown ) విధించిన అనంతరం సైతం కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus spread ) నియంత్రణలోకి రాకపోవడంతో చాలా ఐటి సంస్థలు ( IT companies ) ప్రస్తుతం కొనసాగిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీనే ( Work from home policy ) ఇంకొంత కాలం కొనసాగిస్తే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచిస్తున్నాయి.
న్యూ ఢిల్లీ : లాక్ డౌన్ ( Lockdown ) విధించిన అనంతరం సైతం కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus spread ) నియంత్రణలోకి రాకపోవడంతో చాలా ఐటి సంస్థలు ( IT companies ) ప్రస్తుతం కొనసాగిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీనే ( Work from home policy ) ఇంకొంత కాలం కొనసాగిస్తే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ ( Google ), ఫేస్‌బుక్ ( Facebook ) లాంటి టెక్నాలజీ దిగ్గజాలు 2020 ఏడాది చివరి వరకు తమ సిబ్బంది ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించగా తాజాగా అమెజాన్ ఇండియా ( Amazon India ) సైతం తమ సిబ్బందికి అటువంటి అవకాశాన్నే కల్పించింది. కరోనావైరస్ నియంత్రించడంతో పాటు ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేస్తున్న వాళ్లు ఎవరైతే ఉన్నారో ఈ ఏడాది అక్టోబర్ 2 వరకు పని చేసుకోవచ్చని అమెజాన్ ఇండియా స్పష్టంచేసింది. ( Also read : సురేష్ రైనా టాలెంట్‌పై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు )
ఇంటి నుంచే పని చేసుకోలేని ఉద్యోగులు ఆఫీస్‌కే రావాల్సి ఉంటుందని సంస్థ సూచించింది. విధుల నిమిత్తం ఆఫీస్‌కి హాజరయ్యే సిబ్బంది యోగక్షేమాల కోసం తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు అమెజాన్ ఇండియా వెల్లడించింది.
ఇదిలావుంటే, ఇప్పటికే ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ తమ సిబ్బందికి మరో తీపి కబురు అందించింది. ట్విటర్ సిబ్బంది శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చని ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ ( Twitter CEO Jock Dorsey ) ప్రకటించారు. కరోనావ్యాప్తి అనంతరం ఇలా ఒక సంస్థ తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..