బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సకల కళావల్లభుడన్న విషయం తెలిసిందే. యాక్టింగ్‌తో పాటు కవితలు చెప్పడం, పాటలు పాడడంలో కూడా ఆయన మంచి ఎక్స్‌పర్ట్. ఇటీవలే ఆయన రిషికపూర్‌తో కలిసి నటిస్తున్న "102 నాటౌట్" అనే చిత్రంలో ఓ వైవిధ్యమైన గీతాన్ని ఆలపించారు. ఇటీవలే విడుదలైన ఆ సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిత్రంలో అమితాబ్ 102 ఏళ్ళ వృద్ధుడిగా నటిస్తున్నారు. ఆయన 75 ఏళ్ళ కుమారుడిగా రిషి కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రం మే 4వ తేదిన విడుదల కానుంది. ఈ చిత్రంలో అమితాబ్ పాడిన 'వ‌క్త్ నే కియా' ఇప్పటికే సూపర్ హిట్ కావడంతో చిత్రంపై కూడా భారీగానే అంచనాలు ఏర్పడాయి. గుజరాతీ రైటర్ సౌమ్య జోషి రాసిన ఓ నాటకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 


సలీమ్ సులైమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా.. ఈ సినిమాలో అమితాబ్ పాడిన పాట మాత్రం ఎస్ డీ బర్మన్ గీతానికి రీమిక్స్. ట్రీ టాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, బెంచ్ మార్క్ పిక్చర్స్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ పంపిణీ చేస్తోంది. ఇదే చిత్రంలో గతంలో అమితాబ్ "బదుంబా" అనే గీతాన్ని రిషికపూర్‌తో కలిసి పాడారు.