బాలీవుడ్ టాప్ హీరోయిన్, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మకు ఒక్క చెల్లిలు ఉండట. ప్రపంచానికి తెలియని విషయం ఇప్పుడే బయటపడింది. విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెల్లి అంటే తొడబుట్టిన సంతానం కాదండోయ్.. ఆమె పోలికలతో ఉన్న ఓ యువతి పేరు తైరపైకి వచ్చింది. జులియా అనే అమెరికన్ యువతి అచ్చం అనుష్కపోలికలతో ఉంది. గత కొన్నిరోజులుగా అమెరికన్‌ గాయని జులియా మైకెల్స్‌ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే.


వీరిద్దరి ఫొటోలను పక్కపక్కన పెట్టి ‘అనుష్కా.. నీకు చెల్లి ఉందా?’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.  ఈ ఫొటో కాస్తా అనుష్క, జులియా కంటపడింది. దాంతో జులియా వెంటనే అనుష్కకు ట్విటర్‌లో ఈ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘హాయ్‌ అనుష్క.. మనమిద్దరం కవలలమట..’ అని సరదాగా మెసేజ్‌ పెట్టింది.


ఇందుకు అనుష్క స్పందిస్తూ.. ‘ఓ మై గాడ్.. అవును. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట. నువ్వు కనిపించావ్‌ కాబట్టి మరో ఐదుగురి కోసం వెతుకుతున్నాను’ అంటూ చమత్కరించారు.