Anasuya Comments on Mallemala: TRP స్టంట్లు ఆపేసినప్పుడే మళ్లీ వెళ్తా.. ఆ షోల పరువుతీసిన యాంకర్ అనసూయ
Anasuya Comments on Mallemala Jabardasth TRP Stunts: అనసూయ ప్రస్తుతం బుల్లితెరను బాగానే మిస్ అయినట్టు కనిపిస్తోంది. అనసూయను ఇదే ప్రశ్న ఓ నెటిజన్ అడిగారు. మళ్లీ మీరు ఎప్పుడు బుల్లితెరపై కనిపిస్తారు? అని అడిగితే ఇలా సమాధానం ఇచ్చింది.
Anasuya Comments on Mallemala Jabardasth TRP Stunts: అనసూయ ఇప్పుడు పూర్తిగా బుల్లితెరకు దూరమైన సంగతి తెలిసిందే. అనసూయ కెరీర్‌లో జబర్దస్త్ అనే షో ప్రత్యేక స్థానంలో ఉంటుంది. అలాంటి షో నుంచి అనసూయ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన సమయంలో ఆ షో మీద పరోక్షంగా చేసిన కామెంట్లు ఎంతటి కాంట్రవర్సీకి దారి తీశాయో అందరికీ తెలిసిందే. కొందరి కారణంగా, అక్కడ ఉండలేక బయటకు వచ్చానని చెప్పుకొచ్చింది.
అయితే జబర్దస్త్ షోను వదిలేసిన అనసూయ స్టార్ మాలో కొన్ని రోజులు సింగింగ్ షోకు యాంకరింగ్ చేసింది. అది కూడా ముగిసిపోయింది. అయితే ఇప్పుడు అనసూయ మాత్రం బుల్లితెరకు దూరంగా ఉంటోంది. సినిమాలతోనే అనసూయ బిజీగా ఉంటోంది. అయితే ఇప్పుడు అనసూయ అన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు అనసూయ కూల్‌గా సమాధానాలు ఇచ్చింది.
అందులో ఒక నెటిజన్ ఇలా అడిగేశారు. మిమ్మల్ని బుల్లితెరపై బాగా మిస్ అవుతున్నాం.. మళ్లీ ఎప్పుడు కనిపిస్తారు? అని అడిగేశారు. దానికి అనసూయ ఇలా సమాధానం ఇచ్చింది. ఎప్పుడూ అమర్యాదపూర్వకమైన టీఆర్పీ స్టంట్లు కనిపించకుండా పోతాయో.. అప్పుడు నేను వస్తాను.. నేను కూడా బుల్లితెరను బాగా మిస్ అవుతున్నాను అని బాధపడింది అనసూయ.
[[{"fid":"263630","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
అయితే ఇప్పట్లో అనసూయ బుల్లితెరపై కనిపించేలా లేదు. అసలు బుల్లితెరకు టీఆర్పీ స్టంట్ల వల్లే దూరమైందా? అన్నది అర్థం కావడం లేదు. అయితే ఇప్పుడు అనసూయ దాదాపు అరడజనకు పైగా సినిమాలతో రెడీగా ఉంది. కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్నింట్లోనూ సినిమాలు చేస్తోంది. ద్విభాష సినిమాలతో బిజీగా ఉంది. ఇలాంటి టైంలో బుల్లితెర షోలు అంటే అనసూయకు కష్టంగానే ఉంటుందనిపిస్తోంది.
అనసూయ మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది. ఎంతగా ట్రోలింగ్ జరిగినా, ఎంత మంది నెగెటివ్ కామెంట్లు చేసినా కూడా అనసూయ వెనక్కి తగ్గదు. సైబర్ కేసులు పెడతాను అంటూ.. అందరి కామెంట్లను చూస్తున్నాను అని, స్క్రీన్ షాట్లు పెట్టుకుంటున్నానని, ఏ ఒక్కరినీ వదిలి పెట్టను అంటూ వార్నింగ్ ఇస్తుంటుంది అనసూయ.
Also Read: Medical Student Preethi Suicide: ప్రీతి చనిపోయిందా..? అడ్డంగా బుక్కైన పూనమ్ కౌర్..నెటిజన్లు ఫైర్
Also Read: Anchor Rashmi Gautam : రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజన్.. యాంకర్ జబర్దస్త్ రిప్లై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook