Anchor Rashmi Gautam marriage rumors : యాంకర్ రష్మీకి ఆ యాంకర్‌తో పెళ్లవుతోందని కొత్త రూమర్స్
బుల్లితెర సంచలనం యాంకర్ రష్మీ పెళ్లి వార్త మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. బుల్లితెరపై వివిధ కార్యక్రమాల్లో తనదైన స్టైల్లో యాంకరింగ్ చేసి అతికొద్ది కాలంలోనే భారీ పాపులారిటీ తెచ్చుకున్న రష్మీ గౌతం పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందనే వార్త ఇవాళ కొత్తది కాదు.
బుల్లితెర సంచలనం యాంకర్ రష్మీ పెళ్లి వార్త మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. బుల్లితెరపై వివిధ కార్యక్రమాల్లో తనదైన స్టైల్లో యాంకరింగ్ చేసి అతికొద్ది కాలంలోనే భారీ పాపులారిటీ తెచ్చుకున్న రష్మీ గౌతం పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందనే వార్త ఇవాళ కొత్తది కాదు. తన తోటి యాంకర్ సుడిగాలి సుధీర్‌నే రష్మీ పెళ్లి చేసుకోబోతోందని గతంలోనే సోషల్ మీడియా కోడై కూసింది. అందుకు కారణం ఆ ఇద్దరూ కలిసి చేసిన కార్యక్రమాల్లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడమే. ఆ ఇద్దరి మధ్య చనువు చూసి.. అది ప్రేమేనని, ఆ ఇద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారనే టాక్ అప్పట్లో జోరుగా వినిపించింది. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని ఆ ఇద్దరూ కొట్టిపారేశారు. దీంతో అప్పట్లో రష్మీ-సుధీర్ పెళ్లిపై ఊహాగానాలకు తెరపడింది.
ఇదిలావుంటే, తాజాగా మరోసారి యాంకర్ రష్మి పెళ్లి టాపిక్ తెరపైకొచ్చింది. గతంలో యాంకర్ సుడిగాలి సుధీర్ తో రష్మి పేరును ముడిపెట్టిన వాళ్లు ఈసారి మరో యాంకర్ ను ఈ వార్తల్లోకి లాగారు. ఆ యాంకర్ ఎవరో కాదు... తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు.. పాపులారిటీకి మారుపేరైన ప్రదీప్ మాచిరాజునే. అవును.. ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు, యాంకర్ రష్మీ పెళ్లి చేసుకోబోతున్నారనేది తాజాగా సోషల్ మీడియా టాక్. ఇందులో ఎంత మేరకు నిజం ఉందనే సంగతి పక్కనపెడితే... ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదో హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఇద్దరి మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ నడుస్తోందని కొంతమంది బుల్లితెర ఆడియెన్స్ భావించడమే ఈ రకమైన గాసిప్స్ తెరపైకి రావడానికి ఓ కారణమైంది.
రష్మీ, సుధీర్‌లు ఇదివరకు స్పందించి ఊహాగానాలకు చెక్ పెట్టినట్టే... ఇప్పుడు కూడా రష్మీ, ప్రదీప్‌లలో ఎవరో ఒకరు స్పందించేంత వరకు ఈ రూమర్స్ ఇలాగే చెక్కర్లు కొడతాయోమోనని ఈ రూమర్స్‌ని అంతగా ఎంటర్‌టైన్ చేయని నెటిజెన్స్ అనుకుంటున్నారు.