నటి శ్రీదేవి డెత్ సర్టిఫికేట్ ప్రకారం ఆమె ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో పడి మృతి చెందిందని తేలడంతో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.  దర్యాప్తులో భాగంగా శ్రీదేవి భర్త బోనీ కపూర్ ను దుబాయ్ పోలీసులు విచారిస్తున్నారని భారత్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీన్ని దుబాయ్ మీడియా మాత్రం ఖండిస్తోంది. శ్రీదేవి భర్తను పోలీసులు విచారించలేదని చెబుతోంది. ఇందులో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదనే అంశంపై గందరగోళం నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దుాబాయ్ చట్టాల్లో రాజు కూడా జోక్యం చేసుకోలేరు !


దుబాయ్ చట్టాలు తెలిసిన వారి కథనం ప్రకారం..గల్ఫ్‌ చట్టాల ప్రకారం విచారణలో ఉన్న కేసులకు సంబంధించి ఎలాంటి అంశాలనైనా అధికారులు బయటి వ్యక్తులెవరికీ వెల్లడించే వీలులేదు. ఏదైన కేసు విచారణలో చివరికి దుబాయ్ రాజు కూడా జోక్యం చేసుకునే ఆస్కారం లేదు. దీన్ని బట్టి బోనీ కపూర్ విచారిస్తున్నారనే అంశం ఊహాజనితమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  వాస్తవానికి  దుబాయ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ పేరుతో విడుదలైన రిపోర్ట్ ప్రాథమిక నివేదిక మాత్రమే..పూర్తి రిపోర్టు రావాల్సి ఉంది. పూర్తి స్థాయి రిపోర్టు, పోలీసులు విచారణ తర్వాతే శ్రీదేవి మరణం మిస్టరీ వీడుతుంది.