Ari Movie: రిలీజ్‌కి ముందే అరి పోస్టర్ వైరల్..టాక్ ఎలా ఉందంటే?
Ari Movie: ప్రస్తుతం సోషల్ మీడియాలో పేపర్ బాయ్ మూవీ డైరెక్టర్ జయ శంకర్ మరో సినిమా అరి పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ సినిమాను ఇప్పటికే పలు సినిమా ప్రముఖులు చూశారు. అయితే ఈ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం.
Ari Movie: పేపర్ బాయ్ మూవీకి ఇప్పటికీ మస్త్ క్రేజ్ ఉంది. ఈ సినిమా డైరెక్టర్ జయ శంకర్ త్వరలోనే మరో కొత్త సినిమాతో రాబోతున్నారు. తన రెండవ స్పెషల్ మూవీని అరిని ప్రమోట్ చేసే పనిలో పడ్డారాయన..అంతేకాకుండా ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగు సినీ ప్రముఖులకు చూపించగా..వారంతా సినిమా భలే తీశారని ప్రశించారట. అయితే ఈ సినిమాపై మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే ఈ మూవీని ప్రముఖ డైరెక్టర్, రచయిత యండమూరి వీరేంద్రనాథ్ చూసి కూడా మెచ్చుకున్నారు టాక్.. ఈ చిత్రం విడుదలకు ముందే మంచి పేరు పొందింది. అంతేకాకుండా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం అతి త్వరలోనే థియేటర్స్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది.
పేపర్ బాయ్ మూవీ స్టోరీ నిత్య జీవితంలో జరిగే సంఘటనలు, మన సమాజంలోని నిత్యం చూస్తే విషయాల నుంచి తీసుకున్నట్లు అనిపిస్తుంది. కానీ ఈ అర మూవీ మాత్రం కొంత భిన్నంగా ఉంటుంది. ఇది భిన్నమైన లైన్‌తో పాటు కొత్త స్టోరీతో ముందు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దర్శకుడు ఈ కథలో దైవత్వం అనే పాయింట్‌తో కొత్త ఫాంటసీతో రాబోతున్నట్లు సమాచారం. ఇది మొత్తం ఆరు పాత్రలో సినిమా తిరుగుతుందని సమాచారం.
ఇప్పటికే ఈ మూవీలోని మెయిన్ పాత్రకు సంబంధించిన మొదటి లుక్‌కి సంబంధించిన పోస్టర్‌ను కూడా లాచ్ చేశారు. అంతేకాకుండా ఈ పోస్టర్‌లో ఇక్కడ అన్ని కోరికలు తీర్చబడును అనే క్యాప్షన్ ఉండడం వల్ల ప్రస్తుతం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పోస్టర్‌లో కనిపిస్తున్నట్టుగా వినోద్ వర్మ ప్రధాన పాత్రేంటి? అన్ని కోరికలు తీర్చబడును అంటూ పెట్టిన క్యాప్షన్‌కి ఆర్థం ఏంటి? ఈ క్యాప్షన్‌లో ఎందు నెమలి పించం ఉంది? ఇలాంటి ప్రశ్నార్థకంగా ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదిని త్వరలోనే మేకర్లు ప్రకటించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter