Back to Back Police Cases on Heroine Sreeleela Mother Swarnalatha: హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో పెళ్లి సందD సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఆమె మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుని తెలుగులో వరుస సినిమా అవకాశాలు తెచ్చుకుంటుంది. ప్రస్తుతానికి ఆమె రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రామ్ బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో కూడా ఇప్పటికీ హీరోయిన్ గా ఎంపికైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవి కాకుండా గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటిరెడ్డి హీరోగా రూపొందుతున్న జూనియర్ మూవీలో కూడా ఆమె హీరోయిన్ గా ఎంపికైంది. అయితే ఆమె ఇలా వరుస సినిమా అవకాశాలతో దూసుకువెళుతుంటే ఆమె తల్లి మాత్రం అనవసరంగా శ్రీ లీలను అనవసరంగా వార్తల్లోకి ఎక్కేలా చేస్తోంది. ఎందుకంటే శ్రీ లీల ప్రస్తుతం తన తల్లి స్వర్ణలతతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటుంది. ఆమె 20 ఏళ్ల క్రితమే తన భర్త సురపనేని శుభకర రావు నుంచి విడిగా ఉంటుంది. సుభకర్ రావు పెద్ద పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకున్నారు.


అయితే శ్రీ లీల తల్లి ఈ మధ్య వరుసగా కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే శ్రీ లీల తల్లిదండ్రుల విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. కానీ బెంగళూరులోని పోరమంగళాలో ఉన్న తన అపార్ట్మెంట్ కి తన అనుమతి లేకుండా భార్య స్వర్ణలత వెళ్లి తాళం పగలగొట్టిందని సుభకర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇప్పటికే శ్రీ లీల తల్లి స్వర్ణలతపై మరొక కేసు నడుస్తోంది. అలియాన్స్ యూనివర్సిటీ వివాదంలో ఆమెను ఏ 2 నిందితురాలుగా కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు.


ప్రస్తుతం ఆమె బెయిల్ పై ఉన్నది. ఇప్పుడు తన భర్త అపార్ట్మెంట్లోకి అనుమతి లేకుండా వెళ్లిన వ్యవహారంలో ఆమె మీద మరో కేసు ఫైల్ అయింది. ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు. గతంలో కూడా శ్రీ లీల తన కుమార్తె కాదు అంటూ ఆమె తండ్రి శుభాకరరావు మీడియా వేదికగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. శ్రీ లీల తనకు స్వర్ణలతకు కలిసి పుట్టిన పాప కాదంటూ శుభాకరరావు పేర్కొన్నారు. అనవసరంగా తండ్రిగా తన పేరు వాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కెరీర్ మంచి ఫామ్ లో ఉండగా ఇలాంటి వివాదాలు తెరమీదకు వస్తూ ఉంటే శ్రీ లీల కెరియర్ ఇబ్బందుల్లో పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 


Also Read: Godfather Day 3 Collections: గాడ్ ఫాదర్ సినిమా జోరు.. మూడో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయంటే?


Also Read: Sarvadaman Banerjee Re Entry: 35 ఏళ్ల తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో.. గాడ్ ఫాదర్లో చిరు ఫాదర్ ను ఎవరూ గుర్తు పట్టలేకపోయారుగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook