Cheap Tata Nexon Cars: డెడ్ చీప్‌గా టాటా నెక్సాన్ కారు.. కేవలం రూ. 6 లక్షలకే ఇంటికి తీసుకెళ్లండి!
Tata NEXON Second Hand Cars Buy only Rs 6 Lakhs in Cars24. బడ్జెట్ తక్కువగా ఉండి టాటా నెక్సాన్ కారును కొనాలనుకుంటున్నారా?. అయితే మీరు అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. రూ. 6 లక్షలు పెడితే మంచి టాటా నెక్సాన్ కారును మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు.
Best Second Hand Tata Nexon Cars: 2022 నవంబర్ నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన వాహనాల జాబితాలో 'టాటా నెక్సాన్' కారు రెండవ స్థానంలో ఉంది. నవంబర్ మాసంలో 15871 యూనిట్ల టాటా నెక్సాన్ కార్లు విక్రయించబడ్డాయి. దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు దేశంలో టాటా నెక్సాన్ కార్లకు ఉన్న డిమాండ్ ఏంటో. బడ్జెట్ తక్కువగా ఉండి టాటా నెక్సాన్ కారును కొనాలనుకుంటున్నారా?. అయితే మీరు అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. రూ. 6 లక్షలు పెడితే మంచి టాటా నెక్సాన్ కారును మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు.
మార్కెట్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయానికి అందుబాటులో ఉన్న కొన్ని Tata Nexon SUVల గురించి ఈ రోజు తెలుసుకుందాం. 26 డిసెంబర్ 2022న Cars24 వెబ్‌సైట్‌లో కొన్ని అద్భుత టాటా నెక్సాన్ కార్లు ఉన్నాయి. వాటి ధర 6-7 లక్షల రూపాయల మధ్య ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. మంచి ఇంజిన్ కండిషన్, సూపర్ మైలేజ్ ఇచ్చే కార్లు కూడా ప్రస్తుతం Cars24 వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం.
2019 Tata NEXON KRAZ 1.2 మాన్యువల్ ధర Cars24 వెబ్‌సైట్‌లో రూ. 6,11,000లు ఉంది. ఈ కార్ రీడింగ్ 49,829 కిమీ. ఇందులో పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ కారు మొదటి యజమాని అమ్మకానికి పెట్టారు. ఇది నోయిడాలో అమ్మకానికి అందుబాటులో ఉంది.
2019 Tata NEXON XM 1.2 మోడల్ ధర రూ. 6,41,000. ఇది 28,834 కిమీ ప్రయాణించింది. ఇది పెట్రోల్ ఇంజన్ కారు కాగా.. ప్రస్తుతం రెండో యజమాని దీన్ని అమ్మకానికి పెట్టాడు. ఈ కారు నోయిడాలో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంది.
2019 Tata NEXON XMA 1.5 కారు ధర రూ.6,48,000. డీజిల్ ఇంజిన్‌తో ఈ కారు నడుస్తుంది. ఈ కారు 93,992 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ కారు మొదటి యజమాని దీనిని నోయిడాలో అమ్మకానికి పెట్టారు.
2018 Tata NEXON XT 1.5 కారు ధర రూ.6,82,000. ఇందులో డీజిల్ ఇంజన్ కలదు. ఈ కారు రీడింగ్ 76,034 కిమీ. ఈ కారు మొదటి యజమాని నోయిడాలో అమ్మకానికి పెట్టారు.
Also Read: TSRTC Ticket Discounts: సంక్రాంతి బంపర్ బొనాంజా.. టీఎస్‌ఆర్‌టీసీ టికెట్లపై సూపర్ డిస్కౌంట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.