ఎడిట్ చేయని ఓ బాత్రూమ్ సన్నివేశం వీడియోని ఇంటర్నెట్‌లో పెట్టిన భోజ్‌పురి డైరెక్టర్ ఉపేంద్రకుమార్ వర్మపై బాధిత నటి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. గత సంవత్సరం అంథేరిలోని డైరెక్టర్ ఆఫీసులో మూడు రోజుల పాటు సినిమా చిత్రీకరణ జరిగిందని, స్నానపు గదిలో సన్నివేశాలు షూట్ చేస్తుండగా పొరపాటున తన దుస్తులు జారిపోయాయని పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన దుస్తులు జారిపోయిన సీన్‌ని కూడా షూట్ చేశాడని, ఆ సన్నివేశాన్ని తొలగించమని ఆ డైరెక్టర్‌కి చెప్పి, తనకు రావాల్సిన పారితోషికం తీసుకుని వెళ్లిపోయానని పేర్కొంది. అయితే కొన్ని రోజులకు ఏ సన్నివేశాన్ని అయితే తాను తొలగించమని చెప్పానో, అదే సన్నివేశపు వీడియోను ఇంటర్నెట్‌లో పెట్టాడని, అది మూడు పోర్న్ సైట్లలోకి వెళ్లిందని తెలిపింది. ఎడిట్ చేయని బాత్రూమ్ సీన్‌ని  యూట్యూబ్‌లో, ఆ తర్వాత ఆయా పోర్న్ సైట్లలో చూసినట్టు తన స్నేహితులు, బంధువుల ద్వారా తనకు తెలిసిందని ఆ ఫిర్యాదులో పేర్కొంది.


కాగా.. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడ్ని ముంబైలోని వర్సోవా పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 15 వరకు పోలీసుల కస్టడీలో ఉంచనున్నట్టు వర్సోవా డిప్యూటీ కమిషనర్ పరమ్ జిత్ సింగ్ పేర్కొన్నారు. ఉపేంద్ర వర్మ నుంచి సెల్ ఫోన్, ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.