బిగ్ బాస్ ప్రైజ్ మనీని అలా ప్లాన్ చేస్తున్నా: రాహుల్ సిప్లిగంజ్
బిగ్ బాస్ ప్రైజ్ మనీని అలా ప్లాన్ చేస్తున్నా: రాహుల్ సిప్లిగంజ్
హైదరాబాద్: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ రూ. 50 లక్షల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు. ఫినాలేకు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ టైటిల్ అందుకున్నాడు. ఫైనల్స్‌లో శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. జూలై 21న 17 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ రియాల్టీ షో భారీ అంచనాలకు వేదికైంది. ఉత్కంఠరేపే మలుపులతో, టాస్క్‌లతో వంద రోజులకు పైగా సాగిన బిగ్ రియాల్టీ షో లో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీ రెజా ఫైనల్స్‌కి చేరారు. ఆ ఐదుగురిలో ముగ్గురు ఎలిమినేట్ కాగా ఆఖరికి రాహుల్, శ్రీముఖి మధ్య పోటీ నడిచింది.
గెలుచుకున్న ప్రైజ్ మనీతో ఏం చేస్తావు అని అడగ్గా.. ఆ డబ్బుతో తన కులవృత్తిని కాపాడుకునేలా ‘బార్బర్ షాప్’ పెడతానని ప్రకటించి రాహుల్ తన కులవృత్తి మీద తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు.