మేడపైనే పెళ్లి చేసుకున్న `బిగ్ బాస్` స్టార్
బిగ్ బాస్, రోడిస్ లాంటి రియాలిటీ షోలు గెలుచుకుని టీవీ రియాలిటీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అశుతోష్ కౌశిక్ పెళ్లి చేసుకున్నాడు. అశుతోశ్ కౌశిక్ పెళ్లి ఎప్పుడో ముందే సెటిల్ అయింది.
బిగ్ బాస్, రోడిస్ లాంటి రియాలిటీ షోలు గెలుచుకుని టీవీ రియాలిటీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అశుతోష్ కౌశిక్ పెళ్లి చేసుకున్నాడు. అశుతోశ్ కౌశిక్ పెళ్లి ఎప్పుడో ముందే సెటిల్ అయింది. అయింది అనుకోకుండా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించినప్పటికీ.. తన పెళ్లిని వాయిదా వేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేని అశుతోష్.. ఇదిగో ఇలా ఇంటిపైన మేడపైనే కుటుంబ సభ్యుల సమక్షంలోనే తన కాబోయే భార్య మెడలో తాళి కట్టాడు. ఢిల్లీ శివార్లలోని నొయిడాలో ఉన్న తన నివాసంలోనే ఆదివారం రాత్రి ఈ వివాహం జరిగిందని తెలుస్తోంది.
అశుతోశ్ కౌశిక్ పెళ్లి జరిపించిన పండితుడు మాస్క్ ధరించి వేదమంత్రాలు జపిస్తున్న వీడియోలు అశుతోష్ కౌశిక్ ఫ్యాన్స్ ద్వారా వెలుగులోకొచ్చాయి. ''లాక్‌డౌన్‌లోనే లాక్ డౌన్ అయ్యాను'' అంటూ కౌశిక్ షేర్ చేసుకున్నట్టుగా ఉన్న పలు వీడియోలు ఫేస్‌బుక్‌లో వైరల్ అయ్యాయి.
2007లో జరిగిన రోడిస్ 5వ సీజన్ విజేతగా నిలిచిన అశుతోష్... ఆ తర్వాతి ఏడాదే బిగ్ బాస్ 2వ సీజన్‌లో పాల్గొని ఆ టైటిల్ కూడా సొంతం చేసుకున్నాడు. ఈ రెండు విజయాలతో కౌశిక్‌కి హిందీ టీవీ పరిశ్రమలో రియాలిటీ స్టార్‌గా పేరొచ్చేసింది. ఆ తర్వాత జిల్లా ఘజియాబాద్, కిస్మత్ లవ్ పైసా దిల్లీ అనే సినిమాల్లోనూ అశుతోష్ కౌశిక్ నటించాడు.