Bollywood Actor Arun Bali Passes Away At The Age Of 79 on his Good Bye Movie Release: తెలుగు సహా వివిధ బాషల సినీ పరిశ్రమల నుంచి షాకింగ్ న్యూస్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నటులు వరుసగా మృత్యువాత పడుతూ ఉండగా ఇప్పుడు మరో సీనియర్ నటుడు కన్నుమూశారు. హిందీ బుల్లితెర సహా పలు హిందీ సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు అరుణ్ బాలి తాజాగా కన్నుమూశారు. 79 ఏళ్ల అరుణ్ బాలి ముంబైలో తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరుణ్ బాలి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుతూ ఉండటంతో కొన్ని నెలల క్రితం ఆసుపత్రిలో చేరారు. అరుణ్ బాలి మస్తీనియా గ్రావిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడని సన్నిహితులు తెలిపారు. మస్తీనియా గ్రావిస్ అనేది చాలా అరుదైన  వ్యాధి. నరాలు అలాగే కండరాల మధ్య కమ్యూనికేషన్ వైఫల్యం కారణంగా ఈ వ్యాధి సంభవిస్తుందని తెలుస్తోంది. అరుణ్ బాలి మరణవార్తతో వినోద పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. సీనియర్ నటుడి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


అరుణ్ బాలి 90 లలో తన నట జీవితాన్ని మొదలు పెట్టారు. 'రాజు బన్ గయా జెంటిల్‌మన్‌', 'ఖల్‌నాయక్‌', 'ఫ్లవర్స్‌ అండ్‌ ఎంబర్స్‌', 'ఆ గలే లాగ్‌ జా', 'సత్య', 'హే రామ్‌', 'ఓం జై జగదీష్‌', 'కేదార్‌నాథ్‌', 'లగే రహో మున్నా' సినిమాల్లో ఆయన నటించారు..'3 ఇడియట్స్', 'బర్ఫీ', 'ఎయిర్‌లిఫ్ట్', 'బాఘీ 2', 'పానిపట్', 'కేదార్‌నాథ్' మరియు 'లాల్ సింగ్ చద్దా' వంటి అనేక సినిమాల్లో కూడా ఆయన కీలక పాత్రల్లో నటించారు. సినిమాలే కాకుండా టీవీ షోలలో కూడా బాలి యాక్టివ్‌గా ఉండేవాడు.


అరుణ్ బాలి 'ఫిర్ వహీ తలాష్', 'దిల్ దరియా', 'దేఖ్ భాయ్ దేఖ్', 'మహాభారత్ కథ', 'శక్తిమాన్', 'కుంకుమ్', 'దేవోన్ కే దేవ్ మహాదేవ్' మరియు 'స్వాభిమాన్' వంటి సీరియల్స్ లో కూడా నటించారు. కుంకుమ్ సీరియల్ తో ఆయన చాలా క్రేజ్ సంపాదించారు. సీరియల్లో కుంకుమ్ అంటే జూహీ పర్మార్ తాతగా నటించాడు. అయితే విచారకరమైన విషయం ఏమిటంటే, ఈరోజు అరుణ్ బాలి నటించిన గుడ్ బై మూవీ విడుదలైంది, దురదృష్టకరంగా అదే ఆయన చివరి సినిమాగా నిలిచింది. 


Also Read: Actress locked in telecom firm: నటిని షోరూంలో లాక్ చేసిన సిబ్బంది... చేయి పట్టుకుని అసభ్య ప్రవర్తన.. కేరళలో షాకింగ్ ఘటన?


Also Read: Godfather Day 2 Collections: మెగా మాస్ మానియా.. రెండో రోజు ఊపందుకున్న గాడ్ ఫాదర్..మొదటి రోజు కంటే ఎక్కువగా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook