బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విడాకుల నోటీసు అందుకున్నారు. ఆయన భార్య  ఆలియా తనకు విడాకులు మంజూరు చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు తనకు భరణం మంజూరు చేయించాలని కోర్టును కోరారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందుకు సంబంధించి ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు. లీగల్ నోటీసులు మే 7వ తేదీనే ఈ- మెయిల్, వాట్సప్ ద్వారా  పంపించినట్లు ఆలియా లాయర్ తెలిపారు. దీనిపై నవాజుద్దీన్ సిద్ధిఖీ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆయన ఉత్తరప్రదేశ్  ముజఫర్ నగర్‌లోని సొంత ఇంట్లో ఉన్నారు. మూడు రోజుల క్రితమే ప్రయివేట్ వాహనంలో ముంబై నుంచి ముజఫర్ నగర్‌లోని కుటుంబసభ్యుల వద్దకు చేరుకున్నారు.  


నవాజుద్దీన్ సిద్ధిఖీ ... ఆలియాను 2009లో వివాహం చేసుకున్నారు. వారికి కూతురు షోరా, కుమారుడు యానీ సిద్ధిఖీ ఉన్నారు. నవాజుద్దీన్ సిద్దిఖీకి ఆలియాతో రెండో పెళ్లి కావడం విశేషం. వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉన్నాయని ఆలియా న్యాయవాది మీడియాకు తెలిపారు. ఐతే వాటిని బయటపెట్టడం ఇష్టం లేదని స్పష్టం చేశారు.


చిన్నారితో వెట్టిచాకిరీ..!!


ఈ మధ్యే నవాజుద్దీన్ సిద్ధిఖీ చిన్న సోదరి, తల్లి ఇద్దరూ మృతి చెందారు. ఈ కారణంగా ఆయన ముజఫర్ నగర్ జిల్లా బుధానాలోని సొంత ఇంట్లోనే ఉంటున్నట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం హోమ్ క్యారంటైన్‌లో ఉన్నానని.. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తున్నానని నవాజ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..