Ranveer Singh poses nude for a magazine: ఈ మధ్యకాలంలో బోల్డ్ నెస్ కి అర్థమే మార్చేస్తున్నారు మన హీరో-హీరోయిన్లు ఒకప్పుడు హీరోయిన్లు అందాల ఆరబోయాలంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవారు. అందాలన్నీ ఆరబోస్తే తరువాత తమకు సినిమా అవకాశాలు వస్తాయో రావు అని ఆలోచించేవారు. కానీ ఇప్పుడు అదేమీ లేకుండా సోషల్ మీడియాలోనే అందాలు ఆరబోయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హీరోలు కూడా తామేమి తక్కువ కాదంటూ అవసరం వచ్చినప్పుడు న్యూడ్ షోకి సిద్ధం అవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్నాళ్ల క్రితం లైగర్ పోస్టర్ కోసం విజయ్ దేవరకొండ న్యూడ్ గా ఫొటోకు ఫోజులివ్వగా ఇప్పుడు తాజాగా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేశాడు. దానికి కారణం పూర్తిగా నగ్నంగా కనిపిస్తూ ఫోటోలకు ఆయన ఫోజులు ఇవ్వడమే. అసలు విషయం ఏమిటంటే ఆయన తాజాగా పేపర్ అనే ఒక మ్యాగజైన్ కోసం ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఇక ఈ ఫోటోలలో ఒంటిమీద నోరు పోగు కూడా లేకుండా ఆయన కనిపించాడు.,  అమెరికన్ యాక్టర్ బర్ట్ రెనాల్డ్స్ ను స్ఫూర్తిగా తీసుకుని రణవీర్ ఈ ఫోటో షూట్ చేసినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైర్లు అవుతున్నాయి.



అంతేగాక నగ్నత్వానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను సైతం రణవీర్ ఈ మ్యాగజైన్ తో పంచుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా రణవీర్  నగ్నత్వం గురించి మాట్లాడుతూ మనలో ఉన్న ఆత్మ అసలైన నగ్నత్వం,  అని చెప్పుకొచ్చినాయన నేను 1000 మంది ముందు కూడా నగ్నంగా ఉండగనరని కామెంట్ చేశారు. అందులో తనకి ఎలాంటి సిగ్గు లేదంటూ బోల్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు రణవీర్ సింగ్.


ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రణవీర్ ఇలా న్యూడ్ గా కనిపించడంపై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంత మంది ఇలా చేయడానికి చాలా గుండె ధైర్యం కావాలని అంటుంటే మరి కొంత మంది మాత్రం ఇలా బరితెగించి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం దేనికి సంకేతం అని ప్రశ్నిస్తున్నారు మరి ఈ విషయం మీద మీకు ఏమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి మరి.


Also Read: Thank You Movie Twitter Review: నాగచైతన్య థాంక్యూ సినిమా హిట్టా? ఫట్టా?


Also Read: Thank You Movie: ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లో తెలుసా? హిట్ కొట్టాలంటే అంత రాబట్టాల్సిందే!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.