కార్లు కొనుగోలు చేసేటప్పుడు పొరపాటున కూడా ఒ తప్పు చేయకూడదంటున్నారు ఆటోమొబైల్ నిపుణులు. ఆటోమేటిక్ , మేన్యువల్ గేర్‌బాక్స్ మధ్య అంతరం పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కారు కొనేటప్పుడు ధర, లుక్స్‌తో పాటు ఇతర ఫీచర్ల గురించి కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఆటోమేటిక్, మేన్యువల్ గేర్‌బాక్స్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్లను ప్రీమియం ఫీచర్‌గా పరిగణిస్తారు. ఈ కారు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయినా ఇప్పటికీ చాలామంది మేన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉన్న కార్లనే ఎంచుకుంటుంటారు. ఇప్పుడు మేం మీకు ఆటోమేటిక్ వర్సెస్ మేన్యువల్ గేర్‌బాక్స్ మధ్య అంతరాన్ని తెలుసుకుందాం.. కారు కొనుగోలుకు ముందు ఆ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి.


ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కారు


ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్లలో పదే పదే గేర్లు మార్చాల్సిన అవసరం లేదు. ఇందులో పి అంటే పార్కింగ్, ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవ్ మోడ్ మాత్రమే ఉంటాయి. ఒకసారే గేర్‌ను డ్రైవ్ మోడ్‌పై ఉంచి..ఆ తరువాత డ్రైవింగ్ కొనసాగించవచ్చు. ఆటోమేటిక్ కార్లు సిటీ డ్రైవింగ్, ట్రాఫిక్ జామ్ ప్రాంతాల్లో అనుకూలంగా ఉంటాయి. మేన్యువల్ కార్లతో పోలిస్తే ఇవి కాస్త ఖరీదైనవి. కొద్దిగా తక్కువ మైలేజ్ ఇస్తాయి. అంతేకాకుండా పలు రకాల మార్పులు కూడా ఉంటాయి.


అయితే డ్రైవింగ్, ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. దీనిని డ్రైవ్ చేయడం మేన్యువల్ కారుతో పోలిస్తే చాలా సులభం. మహిళా డ్రైవర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. కంఫర్ట్ డ్రైవింగ్ కోరుకునేవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. పవర్ ఎక్స్‌పీరియన్స్ విషయంలో అంత అనుకూలం కాదనే చెప్పాలి.


మేన్యువల్ గేర్‌బాక్స్


మేన్యువల్ కార్లతో ఓ ప్రత్యేకమైన గేర్‌బాక్స్ ఉంటుంది. కారు స్పీడ్ ప్రకారం గేర్ మార్చాల్సి ఉంటుంది. ఫలితంగా డ్రైవింగ్ సమయంలో కారుపై నియంత్రణ ఉంటుంది. మైలేజ్, పవర్ కూడా బాగుంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కార్లతో పోలిస్తే కొద్దిగా తక్కువ ధర ఉంటాయి.


అయితే ఇందులో ఓ సమస్య ఉంది. ఎక్కువ ట్రాఫిక్ లేదా సుదూర ప్రయాణాల సమయంలో తీవ్ర అలసట ఉంటుంది. మేన్యువల్ కార్లను నేర్చుకోవడం కొద్దిగా కష్టం. సమయం పడుతుంది. ఇక పవర్ డ్రైవ్ విషయంలో మంచి అనుభూతి కలుగుతుంది. 


Also read: Meta Layoffs 2023: మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. ఇప్పటికే 11 వేల మంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook