Diabetic Patients: చియా విత్తనాలతో ఎంతటి మధుమేహమైన 10 రోజుల్లో దిగి రావడం ఖాయం..
Chia Seeds For Diabetic Patients: మధుమేహంతో బాధపడుతున్న చాలామంది విచ్చలవిడిగా ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మధుమేహం మరింత తీవ్రంగా పెరిగిపోతోంది. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించండి.
Chia Seeds For Diabetic Patients: మధుమేహం అనేది ప్రస్తుతం ఒక సాధారణ వ్యాధిల మారిపోయింది. భారత్లో రోజురోజుకు మధుమేహం బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవనశైలేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు కూడా అతిగా తీసుకోవడం వల్ల మధుమేహం వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే రక్తంలోని చక్కెర పరిమాణాలు తప్పనిసరిగా నియంత్రించుకోవాల్సి ఉంటుంది లేకపోతే మధుమేహం సమస్యలు తీవ్రతరమై గుండెపోటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించుకునేందుకు ఆరోగ్య నిపుణులు సూచించిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆహారాలను తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
చియా విత్తనాలు మధుమేహాన్ని నియంత్రిస్తాయా..?
చియా గింజల్లో శరీరానికి కావాల్సిన ఫైబర్ మెగ్నీషియం, ఒమేగా 3 కొవ్వులు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో వినియోగించడం వల్ల మధుమేహంతో పాటు ఊబకాయ సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను సులభంగా తగ్గించడానికి సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారు వీటిని ప్రతిరోజు ఆహారంలో వినియోగిస్తే రక్తంలోని చక్కర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.
చియా విత్తనాలను ఎలా తినాలి?:
చాలామంది ప్రస్తుతం ఈ గింజలను ఆహారంలో వినియోగిస్తున్నారు. అయితే మధుమేహం ఉన్నవారు ఈ గింజలను తీసుకొని.. ఒక గ్లాసుడు నీటిలో వేసుకోవాలి. అందులోనే ఓ రెండు టీ స్పూన్ల నిమ్మకాయ రసం వేసి రెండు గంటలసేపు పక్కన పెట్టాలి. ఇలా నానబెట్టిన గింజలను నిమ్మరసంతో తాగాల్సి ఉంటుంది. మధుమేహం ఉన్నవారు ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల సులభంగా రక్తంలోని చక్కర పరిమాణాలు తగ్గి.. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
చాలామంది వీటిని పండ్ల రసాల్లో వేసుకొని కూడా తాగుతారు. అయితే మధుమేహం ఉన్నవారు ఇలా తాగడం వల్ల రక్తంలోని గ్లూకోస్ స్థాయిలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో మధుమేహం తీవ్రతరం అవుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ఎప్పుడు పండ్ల రసాల్లో ఈ గింజలను వేసుకొని తాగొద్దు.
చియా విత్తనాలు ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు:
మధుమేహం ఉన్నవారు ఈ గింజలను అతిగా వినియోగిస్తూ ఉంటారు ఇలా వినియోగించడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మధుమేహం వ్యాధిగ్రస్తులు వీటిని అతిగా వినియోగించకపోవడం చాలా మంచిది.
Also Read: Minister KTR: సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు.. కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
Also Read: Minister KTR: సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు.. కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి