బిగ్‌బాస్ సుందరి పాటకు క్రిస్ గేల్ డ్యాన్స్
హర్యానాలో స్టేజి షోల ద్వారా బాగా పాపులర్ అయ్యి ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ షోకి వచ్చిన భామ సప్నా చౌదరి.
హర్యానాలో స్టేజి షోల ద్వారా బాగా పాపులర్ అయ్యి ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ షోకి వచ్చిన భామ సప్నా చౌదరి. ఆ అమ్మాయి డ్యాన్స్ చేసిన ఓ పాట బిగ్‌బాస్ షోలో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. "తేరీ ఆంఖ్యా కా కాజల్" అనే పేరుతో మొదలయ్యే ఆ పాట ఎంత పాపులర్ అయ్యిందటే అది యూట్యూబ్‌లో లెక్కలేనన్ని లైకులు, వ్యూస్ దక్కించుకుంది. అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా ఈ డ్యాన్స్ నెంబర్‌కు వీలైనప్పుడల్లా ఆడిపాడి బాగా పాపులర్ అయ్యారు.
ముంబయి పబ్స్‌లో ఇప్పుడు ఈ పాటే హాట్ టాపిక్. అంతలా పాపులర్ అయిన ఆ ఐటమ్ నెంబర్ ద్వారా సప్నా చౌదరికి వచ్చిన అవకాశాలు కూడా ఎక్కువే. పలు బాలీవుడ్ చిత్రాలలో ఆమెకు ఆఫర్లు కూడా వచ్చాయి. అభయ్ డియోల్ నటించిన "నాను కీ జాను" చిత్రంలో సప్నా ఓ ఐటమ్ నెంబర్ కూడా చేసింది.తాజాగా సప్నా ఆడిపాడిన ఐటమ్ నెంబర్ "తేరీ ఆంఖ్యా కా కాజల్"కి క్రికెటర్ క్రిస్ గేల్ డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.
ఆ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంటులో పోస్టు చేసిందిసప్నా చౌదరి. కేవలం పోస్టు చేయడమే కాదు గేల్ పై ప్రశంసల వర్షం కూడా కురిపించింది. గేల్‌లో ఓ గొప్ప డ్యాన్సర్ ఉన్నాడని కూడా తెలిపింది. క్రిస్ గేల్ అప్పుడప్పుడు కొన్ని బాలీవుడ్ డ్యాన్స్ నెంబర్లకు ఆడిపాడిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకసార్లు హల్చల్ చేశాయి. అయితే ఈసారి ఆ లక్ సప్నా చౌదరి చేసిన డ్యాన్స్‌కి దక్కడం విశేషం.