కలర్స్ స్వాతికి కళ్యాణ ఘడియలు వచ్చేస్తున్నాయి
గోల్కొండ హైస్కూలు, డేంజర్, అష్టాచెమ్మా, స్వామి రారా, కలవరమాయె మదిలో, లండన్ బాబులు, బంగారు కోడిపెట్ట లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కలర్స్ స్వాతి అలియాస్ స్వాతి రెడ్డి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గోల్కొండ హైస్కూలు, డేంజర్, అష్టాచెమ్మా, స్వామి రారా, కలవరమాయె మదిలో, లండన్ బాబులు, బంగారు కోడిపెట్ట లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కలర్స్ స్వాతి అలియాస్ స్వాతి రెడ్డి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కలర్స్ టీవీ ప్రోగ్రామ్ ద్వారా యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించిన స్వాతి తర్వాత ప్లేబ్యాక్ సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా రాణించారు. హీరోయిన్ ఇలియానాకు స్వాతి పలు సినిమాల్లో వాయిస్ ఇచ్చారు.
అలాగే "అష్టాచెమ్మా"చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు నంది అవార్డు కూడా అందుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాలలో కూడా స్వాతి కథానాయికగా నటించడం విశేషం. హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాలేజీలో బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన స్వాతి.. 17 ఏళ్లకే యాంకర్‌గా కెరీర్ ప్రారంభించారు. "సుబ్రహ్మణ్యపురం" చిత్రంతో తమిళ నాట కథానాయికగా పరిచయమైన స్వాతి కోలీవుడ్‌లో కూడా మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం స్వాతి మలేషియన్ ఎయిర్ లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్న వికాస్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆగస్ట్ 30న హైదరాబాద్‌లో రాత్రి 7.30 గంటలకు వీరి వివాహం జరగబోతున్నట్లు కొన్ని పత్రికలు ప్రకటించాయి. అలాగే సెప్టెంబరు 2వ తేదిన కొచ్చిలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. ప్రస్తుతం రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తున్న "గీతాంజలి 2" చిత్రంలో ఓ పాత్రలో నటిస్తున్నారు స్వాతి రెడ్డి.