Comedian Rahul Ramakrishna: సహజీవనం, పెళ్లిపై స్పందించిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ
అర్జున్ రెడ్డి సినిమాతో పాపులర్ అయిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ సీక్రెట్‌గా మ్యారేజ్ (Comedian Rahul Ramakrishna Marriage) చేసుకున్నారని, ఎప్పుడో ఓ ఇంటివాడు అయిపోయాడని టాక్. అవన్నీ వదంతులేనని కమెడియన్ స్పష్టం చేశాడు.
అర్జున్ రెడ్డి సినిమాతో పాపులర్ అయిన కమెడియన్ రాహుల్ రామకృష్ణ (Comedian Rahul Ramakrishna).. కెరీర్ సజావుగా సాగుతోంది. అయితే పర్సనల్ లైఫ్ విషయంలోనే కొన్ని వదంతులు నటుడిని ఇబ్బంది పెడుతున్నాయి. భరత్ అనే నేను, గీత గోవిందం లాంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన రాహుల్ రామకృష్ణ చేతిలో ప్రస్తుతం విరాట పర్వం, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులున్నాయి. ఈ కమెడియన్ సీక్రెట్‌గా మ్యారేజ్ (Comedian Rahul Ramakrishna Marriage) చేసుకున్నారని, ఎప్పుడో ఓ ఇంటివాడు అయిపోయాడని టాక్. అవన్నీ వదంతులేనని కమెడియన్ స్పష్టం చేశాడు. క్రికెటర్ విజయ్ శంకర్ ఎంగేజ్‌మెంట్ వేడుక Photos
సోషల్ మీడియా ద్వారా తనకు పరిచయమైన అమ్మాయిని ప్రేమించినట్లు తెలిపాడు. ఆమె నాకు అభిమాని. ఇద్దరి ఇష్టాలు ఒకటే కావడంతో దగ్గరయ్యామని, అర్జున్ రెడ్డి సినిమా చూసి ఆమె తనను మెచ్చుకుందన్నాడు. గతంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పడం నిజమేనని, అయితే పెళ్లికి సమయం దొరకడం లేదంటున్నాడు రాహుల్ రామకృష్ణ. PM Modi లేఖపై స్పందించిన సురేష్ రైనా
2019 జనవరి 15న మ్యారేజ్ అని ట్విట్టర్‌లో పోస్ట్ సైతం చేశాడు. ప్రస్తుతం తాము సహజీవనం చేస్తున్నామని, సినిమాలతో బిజీగా ఉండటంతో పెళ్లికి వీలు చిక్కడం లేదని వాయిదాలు తప్పడం లేదన్నాడు. పెళ్లి హడావుడిగా కాకుండా, సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజీ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తాను లైన్ క్రాస్ చేయకుండా ఆమె జాగ్రత్త పడుతుందని కమెడియన్ రాహుల్ రామకృష్ణ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్
‘చిరుత’ కన్నుల చిన్నది Neha Sharma Hot Photos