హైదరాబాద్: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జనం లాక్‌డౌన్‌కి సహకరించి, కరోనా వైరస్ కట్టిడికి సహకరించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం పిలుపునిస్తున్నాయి. ప్రభుత్వాలే కాకుండా సినీ, రాజకీయ, వ్యాపారం, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ప్రభుత్వాలకు సహకరించాల్సిందిగా కోరుతూ సామాజిక మాధ్యమాల ద్వారా తమకు తోచిన రీతిలో, తమకు తెలిసిన పద్ధతిలో సాధారణ ప్రజానీకానికి, అభిమానులకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో థీమ్ కార్స్ తయారీకి పెట్టింది పేరైన సుధాకర్ సైతం కరోనావైరస్ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కరోనా వైరస్ కారును రూపొందించారు. హైదరాబాద్ కేంద్రంగా సుధా కార్స్ మ్యూజియం ఏర్పాటు చేసిన సుదాకర్.. తాజాగా అదే మ్యూజియంలో ఈ కారును ఆవిష్కరించారు. Also read : లేడీ ఫ్యాన్‌కి హార్ట్ సర్జరీ.. గొప్ప మనసు చాటుకున్న చిరు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"184095","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Sudha-Cars-Museum-in-hyderabad-entry-fee-address","field_file_image_title_text[und][0][value]":"సుధా కార్ మ్యూజియం ఇన్ హైదరాబాద్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Sudha-Cars-Museum-in-hyderabad-entry-fee-address","field_file_image_title_text[und][0][value]":"సుధా కార్ మ్యూజియం ఇన్ హైదరాబాద్"}},"link_text":false,"attributes":{"alt":"Sudha-Cars-Museum-in-hyderabad-entry-fee-address","title":"సుధా కార్ మ్యూజియం ఇన్ హైదరాబాద్","class":"media-element file-default","data-delta":"1"}}]]


విభిన్నమైన ఆకృతుల్లో కార్ల తయారీని ఓ అభిరుచిగా ఎంచుకున్న సుధాకర్ ఎప్పుడు ఏం చేసిన ఆయన ఆలోచనా విధానమే రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు చోటుచేసుకునే ఈవెంట్స్, ఘటనలనే స్పూర్తిగా తీసుకుని కార్లు రూపొందించే సుధాకర్.. ఈసారి కరోనా వైరస్ నివారణకు తన వంతు ప్రయత్నంగా ఈ కరోనావైరస్ కారుని రూపొందించానంటున్నారు. కరోనావైరస్ ఆకృతిలో రోడ్ల మీద తిరుగుతున్న కరోనా వైరస్ కారుని చూస్తే.. ఇప్పటివరకు కరోనావైరస్‌కు భయపడకుండా రోడ్లపై యధేచ్చగా తిరిగిన వాళ్లు కూడా ఇక వెనక్కి తిరిగి ఇంటికెళ్లిపోవాల్సిందే అనేట్టుగా కరోనా వైరస్ కారు డిజైన్ ఉంది. 


Also read : అల్లు అర్జున్ 'పుష్ప' ఫస్ట్ లుక్


[[{"fid":"184096","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


Also read : Hanuman Jayanti puja: హనుమాన్ జయంతిని ఏ రోజు, ఏ సమయంలో జరుపుకుంటారు ?


కరోనా వైరస్ కారు తయారీ కోసం ఆయనకు 10 రోజుల సమయం పట్టిందట. సుధాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం 100 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఈ కారు లీటర్ పెట్రోల్‌కు 40 కి.మీ మైలేజీ ఇవ్వగలదు. కరోనా కారు ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లపైనే కాదు.. సోషల్ మీడియా పేజీల్లో సైతం చక్కర్లు కొడుతోంది. కరోనాపై అవగాహన కల్పించే లక్ష్యంతో సుధాకర్ చేసిన ఈ ప్రయత్నం వల్ల కొంతమంది మారి జాగ్రత్తలు పాటించినా అది సంతోషించదగిన విషయమే కదా!!  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..