పంచ్ డైలాగ్స్‌తో అదరగొడుతున్న దబంగ్ 3 ట్రైలర్
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ 3 ట్రైలర్ ఆడియెన్స్ ముందుకొచ్చింది
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబంగ్ 3 ట్రైలర్ ఆడియెన్స్ ముందుకొచ్చింది. 'చుల్‌బుల్ రాబిన్‌హుడ్ పాండే'గా ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను అలరించేందుకు సల్మాన్ ఖాన్ రెడీ అయ్యాడు. 'దబంగ్', 'దబంగ్ 2' బ్లాక్ బస్టర్స్ తర్వాత.. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. దబంగ్ -3 ట్రైలర్‌లో ''ఖాకీ వేస్తే పోలీస్, తీస్తే రౌడీ.. టోటల్‌గా ఆల్‌రౌండర్‌ని'' అంటూ సల్మాన్ ఖాన్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్.. ఆద్యంతం అదుర్స్ అనిపించే డైలాగ్స్‌తో ఆకట్టుకుంటోంది. సల్మాన్ ఖాన్ హీరోయిజం, కామెడీ టైమింగ్, రొమాన్స్, యాక్షన్ అన్నీ ఒకదానితో మరొకటి పోటీపడినట్టున్నాయా అనిపించేలా ట్రైలర్‌ను కట్ చేశారు.
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించడం విశేషం. అదుర్స్ సినిమాలో విలన్‌గా కనిపించిన ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్ ఈ సినిమా ద్వారానే బాలీవుడ్‌కి పరిచయమవుతోంది. ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ''దబాంగ్ 3'' విడుదల కానుంది.