డ్యాన్స్ అంకుల్.. బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు
సోషల్ మీడియాలో ఒక్కరాత్రిలోనే స్టార్ అయిపోయిన `డ్యాన్సింగ్ అంకుల్` ప్రొఫెసర్ శ్రీవాత్సవ విదిశా మునిసిపల్ కార్పోరేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు.
సోషల్ మీడియాలో ఒక్కరాత్రిలోనే స్టార్ అయిపోయిన 'డ్యాన్సింగ్ అంకుల్' ప్రొఫెసర్ సంజయ్ శ్రీవాత్సవ విదిశా మునిసిపల్ కార్పోరేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు.
ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీవాత్సవ(46) ఓ పెళ్లికి హాజరై.. డాన్స్ వేశారు. బాలీవుడ్ నటుడు గోవిందాకు వీరాభిమాని అయిన శ్రీవాత్సవకు నచ్చిన పాట వినిపించేసరికి పెళ్లి వేడుకలో డాన్స్ అదరగొట్టారు. ఏమాత్రం అలసిపోకుండా ఆయన చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. కొన్ని లక్షల మంది ఈ వీడియో చూశారు. దీంతో ఆయన ఒక్కరాత్రిలోనే స్టార్ అయ్యారు. తర్వాత డ్యాన్స్ యూట్యూబ్‌లో సెన్సేషన్ అయింది.
ఈ నేపథ్యంలోనే విదిశ మున్సిపాలిటీ సంజయ్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. అంతకు ముందు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా సంజయ్ డాన్స్‌కు మెచ్చి ప్రత్యేక అభినందనలు తెలిపారు. 1982 నుంచి డాన్స్ చేస్తున్నానని.. గోవిందా జీ నాకు రోల్ మాడల్ అని, అమ్మ దగ్గర నుంచి డ్యాన్స్ నేర్చుకున్నట్లు శ్రీవాత్సవ తెలిపారు. బ్రాండ్ అంబాసిడర్‌గా తనను ఎంపిక చేయడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు.