SIR Pre Release Event వెంకీ అట్లూరి దర్శకుడిగా ధనుష్‌ హీరోగా తమిళ తెలుగు భాషల్లో వస్తోన్న చిత్రం సార్. ఈ సినిమా తమిళంలో వాతి అనే పేరుతో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలోనే బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ధనుష్‌ తెలుగులో మాట్లాడి అందరినీ మెప్పించాడు. అంతేకాకుండా మాస్టారు మాస్టారు అంటూ తెలుగులోనే పాట పాడేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తమన్, త్రివిక్రమ్, డైరెక్టర్ వెంకీ ఇలా అందరి గురించి మాట్లాడాడు. ఈ సినిమా కథ జనాల నుంచి వచ్చింది.. ఇది వారి కథ.. వారికి కచ్చితంగా నచ్చుతుంది.. సినిమా సింపుల్‌గా ఉంటుంది.. కానీ బలమైన ఎమోషన్స్‌తో ఉంటుంది.. ఉపన్యాసాలు ఇచ్చినట్టుగా కాకుండా..  ఎంటర్టైన్మెంట్ వేలోనే కథను చెప్పామని సినిమా గురించి ధనుష్‌ చెప్పుకొచ్చాడు.


తెలుగు అంతగా రాకపోయినా ప్రయత్నిస్తున్నాను.. తప్పులు ఉంటే క్షమించండి.. అంటూ స్పీచును తెలుగులోనే కానిచ్చేశాడు. ఇక ఇందులో భాగంగా చివరకు ఆది గురించి చెప్పుకొచ్చాడు. ముందు తనకు ఆది ఎవరో తెలీదని, అతని క్రేజ్ గురించి తెలీదని అన్నాడు. మొన్న ఓ ఫంక్షన్ పెడితే.. ఆది పేరు రాగానే విజిల్స్, క్లాప్స్ వచ్చాయని, అప్పుడు ఆది గురించి అర్థమైందని అన్నాడు ధనుష్‌.


ఆది ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాడో, క్రేజ్ వచ్చిందో తెలియదని ధనుష్‌ చెబుతూ ఉంటే.. పక్కనే ఉన్న త్రివిక్రమ్ వివరించి చెప్పాడు. జబర్దస్త్ అనే షోతో ఫేమస్ అయ్యాడు.. ఆరేడేళ్లుగా రైటర్‌గా, నటుడిగా తన మార్క్ చూపిస్తున్నాడని, ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాడంటూ చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్. అయితే అవన్నీ నేను యూట్యూబ్‌లో చూస్తాను.. నెక్ట్స్ టైం ఆది పేరు వస్తే నేను కూడా చప్పట్లు కొడతాను అని ధనుష్‌ అంటుంటే.. ఆది కాళ్లను మొక్కబోయాడు. కానీ ధనుష్‌ మాత్రం వద్దని వారించాడు.


Also Read:  Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు


Also Read: Supritha Photos : వామ్మో అనిపించేలా సుప్రిత అందాలు.. తల్లితో కలిసి బీచ్‌లో అలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook