దిల్ రాజు పెళ్లిపై అంత ఇంట్రస్ట్ ఎందుకంటే..
దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారనే వార్త ఇవాళ సోషల్ మీడియాలో ఓ వైరల్ న్యూస్‌గా మారింది. అవును.. దిల్ రాజు పెళ్లి వార్త ఇవాళ అన్ని రకాల సామాజిక మాధ్యమాల్లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. సినీరంగంలో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు.. దిల్ సినిమాతో నిర్మాతగా మారి అనతికాలంలోనే అగ్ర నిర్మాతగా ఎదిగారు. అన్నివర్గాల అభిమానులను ఆకట్టుకునేలా చక్కటి కుటుంబ కథా చిత్రాలను నిర్మించడంలో దిల్ రాజు అభిరుచే వేరు.
దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారనే వార్త ఇవాళ సోషల్ మీడియాలో ఓ వైరల్ న్యూస్‌గా మారింది. అవును.. దిల్ రాజు పెళ్లి వార్త ఇవాళ అన్ని రకాల సామాజిక మాధ్యమాల్లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఆయన ప్రముఖ నిర్మాత కావడం అందుకు ఓ కారణం అయితే, కరోనావైరస్ నివారణకు అందరూ సోషల్ డిస్టన్సింగ్ పాటిస్తున్న ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో పెళ్లి చేసుకోవడం, అది కూడా రెండో పెళ్లి కావడం, కులాంతర వివాహం కావడం వంటివి ఈ పెళ్లికి ఇంత ప్రచారం లభించడానికి మరో కారణమయ్యాయి.
Also read : పెళ్లికి ముందే దిల్ రాజు భార్య పేరు మార్పు!
ఓవైపు కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఓ రకమైన ఆందోళన నెలకొన్నప్పటికీ.. దిల్ రాజు వివాహాంపై జనంలో ఇంత ఆసక్తి ఏర్పడటానికి మరో కారణం ఆయనకున్న ఇమేజ్. సినీరంగంలో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు.. దిల్ సినిమాతో నిర్మాతగా మారి అనతికాలంలోనే అగ్ర నిర్మాతగా ఎదిగారు. అన్నివర్గాల అభిమానులను ఆకట్టుకునేలా చక్కటి కుటుంబ కథా చిత్రాలను నిర్మించడంలో దిల్ రాజు అభిరుచే వేరు. బొమ్మరిల్లు, పరుగు, కొత్త బంగారులోకం, బృందావనం, Mr. పర్‌ఫెక్ట్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి, ఫిదా, శ్రీనివాస కల్యాణం, హలో గురు ప్రేమకోసమే, F2.. ఇలా చెప్పుకుంటూపోతే చాలా సినిమాలే ఉన్నాయి. ఇవన్నీ మచ్చుకు మాత్రమే.
Also read : Mothers Day: దిల్ రాజుకు రెండో పెళ్లి చేసిన కూతురు
కేవలం కుటుంబ కథా చిత్రాలే కాకుండా.. ఆకట్టుకునే ఫ్యామిలీ సెంటిమెంట్స్‌తో యాక్షన్ థ్రిల్లర్స్, ఫ్యాక్షన్ డ్రామాలు నిర్మించడంలోనూ దిల్ రాజు తన అభిరుచిని చాటుకున్నాడు. ఆయన నిర్మించిన చిత్రాల్లో కొన్ని ప్రయోగాలూ ఉన్నాయి. కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించడంలోనూ దిల్ రాజు రాజే. కథలపై పట్టు, ఒక అభిరుచి, ఆడియెన్స్ పల్స్ తెలిసిన నిర్మాత ఆయన. అందుకే దిల్ రాజు సినిమా అంటే ఎంటర్‌టైన్మెంట్ గ్యారెంటీ అనేది ఆడియెన్స్‌లో ఉన్న అభిప్రాయం. ఇవే ఆయన్ని టాప్ ప్రొడ్యూసర్‌ను చేశాయి.
నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు
దిల్ రాజుకు టాలీవుడ్‌లోనే కాకుండా తమిళ, మళయాళం, కన్నడ, హిందీ పరిశ్రమల్లోనూ స్నేహితులున్నారు. దిల్ రాజు సినిమాలకు ఉండే మార్కెట్‌ని, బాక్సాఫీస్ గణాంకాలను నిశితంగా పరిశీలించే ట్రేడ్ ఎనలిస్టులున్నారు. ఇవాళ దిల్ రాజు పెళ్లి సందర్భంగా వాళ్లు కూడా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియా సైతం దిల్ రాజు పెళ్లిపై అనేక కథనాలు ప్రచురించింది. లాక్ డౌన్ నేపథ్యంలో జరిగిన పెళ్లి కావడంతో జాతీయ మీడియా కూడా ప్రత్యేక దృష్టి సారించింది. అలా దిల్ రాజు వివాహ వేడుక మొత్తానికి టాక్ ఆఫ్ ది టౌన్ అయి ట్రెండింగ్ న్యూస్ అయ్యింది. దిల్ రాజు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also read : దిల్ రాజు పెళ్లిపై కూతురు ఏమన్నారంటే!
ఇవేకాకుండా ఇంత పెద్ద నిర్మాతను పెళ్లి చేసుకుంటున్న ఆ యువతి ఎవరు ? ఏం చేస్తారు ? ఆమె నేపథ్యం ఏంటి ? పెళ్లి వెనుకున్న ప్రత్యేకతలు ఏంటి ? అసలు పెళ్లి ఎక్కడ జరిగింది ? ఎలా జరిగింది ? కూతురు హన్షిత పాత్ర ఎంత మేరకు ఉంది లాంటి సందేహాలన్నీ దిల్ రాజు పెళ్లిని ఆయన సినిమాల్లాగే భారీ హిట్ చేసేశాయి. అదండీ సంగతి!! జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..