హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దాసరి విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు తనయుడు అరుణ్ కుమార్‌తో పాటు నందమూరి బాలకృష్ణ, ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల, మురళీ మోహన్, ముత్యాల సుబ్బయ్య, వివి వినాయక్, అల్లు అరవింద్, సి.కళ్యాణ్, ఎన్ శంకర్, కోడి రామకృష్ణ, అంబికా కృష్ణ, త్రిపురనేని చిట్టి, విజయ్ చందర్, ఆది శేషగిరిరావు, కాదంబరి కిరణ్ కుమార్, వందేమాతరం శ్రీనివాస్ మొదలైన సినీ ప్రముఖులు పాల్గొన్నారు.


"మా" సంస్థ ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ మహోత్సవం జరిగినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. 'తాతామనవడు' చిత్రం ద్వారా 1972లో దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించిన దాసరి నారాయణరావు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డైరెక్షన్ వహించారు. స్వర్గం నరకం, బలిపీఠం, తూర్పు పడమర, కటకటాల రుద్రయ్య, ప్రేమాభిషేకం, మేఘ సందేశం, ఒసేయ్ రాములమ్మ లాంటి చిత్రాలతో దాసరి అశేష ప్రేక్షకాభిమానాన్ని పొందారు. 2017 మే 30న అనారోగ్య కారణాల వల్ల ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు