సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన 'భరత్‌ అనే నేను' సినిమా కథ మీద ఆ మధ్య కొన్ని రూమర్లు హల్చల్ చేశాయి. అసలు ఆ కథ కొరటాల శివదే కాదని.. రూ. కోటి ఇచ్చి ఓ రచయిత దగ్గరి నుంచి స్టోరీ కొనుక్కున్నాడని  ప్రచారం జరిగింది. అంతేకాదు.. హాలీవుడ్ నుంచి కాపీ కొట్టారనే టాక్ వినిపించింది. 1995లో అమెరికాలో విడుదలైన ది అమెరికన్ ప్రెసిడెంట్ సినిమాలో హీరో ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేస్తాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండు బిల్లులను పాస్ చేసే విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాడు. తరువాత ఎన్నికలు దగ్గరకు వస్తుంటాయ్. ఆ సమస్యలు నుండి హీరో ఎలా బయటపడ్డాడో అదే కథ. ఈ కథ 'భ‌ర‌త్ అను నేను'కి దగ్గరిగా ఉందని వార్తలు వచ్చాయి.  అలాగే రానా నటించిన తొలి సినిమా లీడర్ తరహాలో ఈ కథ ఉందని కూడా కొందరు అన్నారు.


అయితే ఆ కథనాలపై తాజాగా ఆయన చిత్ర ప్రమోషన్‌లలో స్పందించారు. అదంతా రూమర్‌ అని కొట్టిపడేశారు. పనిలో పనిగా కథను ఎలా సిద్ధం చేసిందన్నది ఆయన చెప్పుకొచ్చారు.  అయితే "భరత్ అనే నేను" సినిమా కథ కాపీ అనే ప్రచారాన్ని దర్శకుడు కొరటాల శివ కొట్టిపారేశారు. కెరీర్ తొలినాళ్లలో నా రూంమేట్ దర్శకుడు శ్రీహరి నాకు ఓ ఐడియా ఇచ్చాడు.


ఓ సీఎం పాత్ర.. అంటూ  అతను ఇచ్చిన ఆలోచన అద్భుతంగా ఉంది. అది నాకు తెగ నచ్చింది. అందులో ఓ లైన్ నచ్చి కథను రాసుకున్నానని శివ తెలిపాడు. ఇది పూర్తిగా నా సొంత కథ అని చెప్పుకొచ్చారు.  ఐడియా ఇచ్చినందుకు టైటిల్ కార్డులో నా స్నేహితుడికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నామని అన్నాడు. మహేష్‌ బాబు-కైరా అద్వానీ జంటగా నటిస్తున్న భరత్‌ అనే నేను చిత్రం ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.