హైదరాబాద్: సాహో చిత్రంతో పాన్ ఇండియా ప్రచారం దక్కించుకున్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డైరెక్టర్ సుజీత్ కొంతకాలంగా ప్రవల్లిక అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ప్రవల్లిక ఓ దంత వైద్యురాలు కాగా వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు సైతం అంగీకారం తెలపడంతో గత రాత్రి నిశితార్థం జరిగింది. పరిమితమైన సంఖ్యలో కొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. వివాహం ఎప్పుడన్నదానిపై త్వరలోనే స్పష్టత రానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: రణబీర్ వేసిన చిత్రానికి కృతఙ్ఞతలు తెలిపిన సోనూసూద్..


ఇదిలాఉంటే పాన్ ఇండియా ప్రచారం దక్కించుకున్న సుజీత్... మెగాస్టార్ చిరంజీవితో మలయాళ చిత్రం 'లూసిఫర్' రీమేక్ చేసే చాన్స్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం దీని స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అయితే లఘు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ కొద్దికాలంలోనే ప్రముఖ హీరోలతో చిత్రాలు దర్శకత్వం వహించే స్థాయికి ఎదగడం విశేషం.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..