పవన్ కళ్యాణ్ కోపం చల్లారిందా..?
శ్రీరెడ్డి తనపై అశ్లీల వ్యాఖ్యలు చేశాక.. పవన్ కళ్యాణ్ పలు మీడియా ఛానళ్లపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. వాటిపై ఘాటుగా స్పందిస్తూ.. ఆయన పలు పోస్టులను ట్విట్టర్‌లో కూడా పంచుకున్నారు. ఆ తర్వాత పలు జర్నలిస్టు సంఘాలు పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతూ.. కేసులు కూడా నమోదు చేశాయి.
శ్రీరెడ్డి తనపై అశ్లీల వ్యాఖ్యలు చేశాక.. పవన్ కళ్యాణ్ పలు మీడియా ఛానళ్లపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. వాటిపై ఘాటుగా స్పందిస్తూ.. ఆయన పలు పోస్టులను ట్విట్టర్‌లో కూడా పంచుకున్నారు. ఆ తర్వాత పలు జర్నలిస్టు సంఘాలు పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతూ.. కేసులు కూడా నమోదు చేశాయి. ఆ తర్వాత కొన్ని వారాలుగా ఇదే అంశంపై ఎలాంటి వార్తలూ రాలేదు.
పవన్ కళ్యాణ్ సైతం తన పార్టీ కార్యక్రమాల్లో తలమునకలైపోయారు. అయితే పవన్ కళ్యాణ్‌కి, ఆయన ఘాటుగా విమర్శించిన ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కి మధ్య సయోధ్య కుదిరిందని పలు ఆన్‌లైన్ ఛానళ్లు రాయడం గమనార్హం. ఎందుకంటే... ఇటీవలే పవన్ కళ్యాణ్ "నా పేరు సూర్య" సినిమా థ్యాంక్స్ మీట్‌కి అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఆయా కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి హక్కులు కలిగిన ఛానల్ గతంలో పవన్ ఘాటుగా విమర్శలు చేసిన ఛానలే కావడం గమనార్హం.
ఈ క్రమంలో ఆ ఛానల్‌కి, పవన్ కళ్యాణ్‌కి మధ్య సయోధ్య కుదిరిందేమో అన్న అనుమానాన్ని పలు ఆన్‌లైన్ వెబ్‌సైట్లు రాస్తున్న వార్తలు కలిగిస్తున్నాయి. అలాగే త్వరలో పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు కూడా నాంది పలకబోతున్న కార్యక్రమం కూడా ఉంది కాబట్టి.. ఆ ఈవెంట్ కూడా పలు ఛానల్స్ ఎక్స్‌క్లూజివ్‌గా కవర్ చేయాల్సిన అవసరం ఉంది.
అది పవన్‌తో పాటు మీడియాకి కూడా లాభం చేకూర్చే అంశమే కాబట్టి.. ఇరు వర్గాలు సయోధ్య కుదుర్చుకొని పాత వివాదాలకు స్వస్తి చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. అయితే పవన్‌కి పలు ఛానల్స్ మీద ఉన్న కోపం తగ్గలేదని పలువురు అంటున్నారు. ఎల్లో మీడియాపై ఆయన ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటారని అంటున్నారు ఆయన అభిమానులు
మే 1వ తేదిన జనసేన టీమ్ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేసింది. అందులో "మీడియా నీచపు కోణం" పేరుతో కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇదే నా మీ సంస్కారం? అని ప్రశ్నిస్తూనే.. మీరెవరు బంధాలను నిర్ణయించడానికి అని హితవు పలికారు. అలాగే వర్ణ వివక్ష జర్నలిజమా? అని అడిగారు. బ్రతికున్న వారిని చంపేస్తారా? నిజాన్ని నిర్థారించడానికి మీరేమైనా న్యాయస్థానాలా? అని కూడా అడిగారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయాలపై ఎప్పుడు ఎలా స్పందిస్తారో అన్నది తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.