పారాసిటమాల్‌తో ఆస్తమా..!
పారాసిటమాల్‌తో ఆస్తమా..!
పారాసిటమాల్.. దీన్ని సాధారణంగా జ్వరము, తలనొప్పి, బాడీ పెయిన్స్‌కి వాడుతారు. ఇది అనేక జలుబు, ఫ్లూ మందులు తయారీలో వాడే ఒక ముఖ్య పదార్ధము. మీరు డాక్టర్‌ని సంప్రదించకుండా.. సొంతంగా మెడికల్ షాపుకి వెళ్లి జ్వరానికి లేదా తలనొప్పికి లేదా బాడీ పెయిన్స్‌కి టాబ్లెట్ అడిగితే పారాసిటమాల్ టాబ్లెట్ ఇస్తారు అవునా. కానీ పారాసిటమాల్ వాడితే ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది.
2018లో యూరోపియన్ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్‌లో సమర్పించబడిన ఒక కొత్త పరిశోధన ప్రకారం ఈ విషయం తెలిసింది.
చిన్నారులు బాల్యంలో (రెండేళ్ల వయసు నుంచి) పారాసిటమాల్ తీసుకుంటే వారికి భవిష్యత్తులో (18 ఏళ్ల వయసు వచ్చే వరకు) ఆస్తమా వస్తుందని ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. పారాసిటమాల్‌కి, ఆస్తమాకు మధ్య సంబంధం ఉందని శాస్త్రవేత్తల బృందం వివరించారు. కుటుంబంలో ఒక్కరికైనా ఆస్తమా ఉన్న వారి పిల్లలను అధ్యయనానికి ఎంచుకున్నట్లు తెలిపారు. ఇలా 620 మంది పిల్లలపై పుట్టినప్పటి నుంచి 18 ఏళ్లు వచ్చే వరకు అధ్యయనం చేశారు.
పారాసిటమాల్.. పిల్లల శ్వాసకోశ ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, ఇది అస్తామాకు ఒక కారణం అవ్వొచ్చని పరిశోధకులు మరిన్ని ఆధారాలతో తెలిపారు.