విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్-జీవిత దంపతుల కూతురు శివాత్మిక జంటగా తెరకెక్కిన చిత్రం దొరసాని. తెలంగాణలో స్వాతంత్య్రోద్యమానికి ముందునాటి ప్రేమ కథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ఇటీవల విడుద‌ల కాగా తాజాగా దొరసాని టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో ఆనంద్‌ దేవరకొండ రాజు అనే ఓ మధ్య తరగతి యువకుడి పాత్రలో, దొర‌సాని పాత్రలో శివాత్మిక నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో కేవీఆర్ మహేంద్ర దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తుండగా సన్ని కూరపాటి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా విడుదలైన దొరసాని టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి.