హైదరాబాద్: మీరు శుభలగ్నం సినిమా చూసే ఉంటారు. అందులో హీరోయిన్ ఆమనికి డబ్బుపై వ్యామోహం ఎక్కువ. ఒకదశలో డబ్బుపై ఉన్న ఆశతో కట్టుకున్న భర్తనే అమ్మేస్తుంది. వాస్తవానికి ఇది ఒక సినిమా. ఈలాగే రియల్ లైఫ్ లో జరిగిన ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ తరహ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకున్నది. కానీ శుభలగ్నం సినిమా సీన్ కు భిన్నమైన కీచక భర్త పర్వం ఇది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: హోమ్ క్వారంటైన్‌లోకి మంత్రి హరీష్ రావు


రాజస్థాన్ ఉదయపూర్ ఘంటాధర్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. మానవత్వం సిగ్గుపడే ఘటన జరిగింది. డబ్బుపై వ్యామోహంతో కట్టుకున్న భార్యను స్నేహితులకు అమ్మేశాడు ఓ కీచక భర్త. జావేద్ ఖాన్ అనే వ్యక్తి నిత్యం మద్యం మత్తులో తేలుతుండేవాడు. మతుకు బానిసై స్నేహితులతో కలిసి భార్యను శారీరకంగా హింసించేవాడు. భార్యను అశ్లీలంగా చిత్రీకరించి తాను చెప్పినట్టు చేయకుంటే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించేవాడు. తన వేదన పక్కవారికి చెప్పుకోలేక దుఃఖాన్ని దిగమింగి బతికింది కాలాన్ని గడిపిందామె. తాజాగా స్నేహితుల దగ్గర డబ్బు తీసుకుని ఆమెను వారికి అప్పగించేశాడు జావేద్. శారీరకంగా, మానసికంగా వేదనకు గురైనా బాధితురాలు ఆ నరకం నుంచి కాపాడమని పోలీసులను వేడుకుంది. దీంతో ఆమెకు వైద్యం అందించి భర్త జావేద్ ఖాన్, అతడి స్నేహితుడు మోనూను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. TDP నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..