బెంగుళూరులోని దివాకర్ బార్ అండ్ రెస్టారెంటుకి ప్రతీ రోజు ఒక కోతి వస్తూ ఉండేదట. వచ్చిన ప్రతీ సారి దానికి మందుబాబులు కొందరు మద్యం సేవించడం నేర్పించడంతో.. ఆ కోతి కూడా ఆఖరికి మద్యానికి బానిసైంది. అలా మద్యానికి బానిసైన కోతి మంగళవారం రాత్రి ఆ బార్‌కి వచ్చి యథావిధిగా మందు తాగింది. అయితే ఈ సారి తాగి ఊరుకోలేదు. అక్కడి మందుబాబులందరినీ భయాందోళనలకు గురిచేసింది.


అందరి వెంటా పడుతూ నానా హంగామా చేసింది. అసలే కోతి.. ఆపై మద్యం సేవించింది... ఎక్కడ కరుస్తుందేమోనన్న భయంతో ఆఖరికి అక్కడున్న వారందరూ కూడా పరుగులంకించుకున్నారు. నేరకపోయి ఈ కోతికి మందు తాగించడం నేర్పించాం అని తలలు బాదుకున్నారు. ఆ బార్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా.. ఆ కోతి మాట వినకపోయేసరికి.. ఆఖరికి అరటి పండ్లను ఎరగా చూపి దానిని బంధించారు. ప్రస్తుతం ఆ కోతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.