Get Rid Of Dry Skin On Nose: ఆధునిక జీవనశైలిని అనుసరించే  చాలా మందిలో పొడి చర్మం సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలే కాకుండా చర్మంపై మొటిమలు, మచ్చల సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీరు నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా రసాయనాలతో కూడిన ఫేస్‌ ఫ్యాక్‌లను వినియోగించకుండా ఇంట్లో తయారు చేసిన ఫేస్‌ ఫ్యాక్‌లను వినియోగించాలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పొడి చర్మం సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా చర్మం మెరిసేలా తయారవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డ్రై స్కిన్‌ని దూరం చేసే ఫేస్‌ ఫ్యాక్‌లు ఇవే:
చర్మ సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ఫేస్‌ ఫ్యాక్‌లను వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా ఓట్స్, తేనె, పెరుగుతో పాటు శెనగపిండి, బొప్పాయితో తయారు చేసిన ఫేస్‌ ఫ్యాక్‌లను వినియోగించడం వల్ల సులభంగా డ్రై స్కిన్‌ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పోషక గుణాలు అన్ని రకాల చర్మ సమస్యలను దూరం చేసేందుకు సహాయపడతాయి. 


డ్రై స్కిన్‌నికి బెస్ట్‌ ఫేస్‌ ఫ్యాక్స్‌ ఇవే:


Also Read: Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు


శనగ పిండి, పెరుగు ఫేస్ ప్యాక్:
✺ ఈ ఫేస్ ప్యాక్‌ను తయారు చేయడానికి ముందుగా మూడు  టేబుల్ స్పూన్ల శెనగపిండి, రెండు టేబుల్‌ స్పూన్‌ల పెరుగును తీసుకోవాల్సి ఉంటుంది. 
✺ ఆ తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 
✺ ఇలా మిక్స్‌ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, మెడ అంతటా అప్లై చేయాలి.
✺ ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా ఆరనివ్వాల్సి ఉంటుంది.
✺ ఇలా ఆరిన తర్వాత మసాజ్‌ చేసి శుభ్రం చేసుకోవాలి.


ఓట్స్, తేనె ఫేస్ ప్యాక్:
✺ ఈ ఫేస్ ప్యాక్‌ చర్మానికి చాలా రకాల ఉపయోగపడుతుంది. ఇది చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 
✺ ఓట్స్, తేనె ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా ఓ చిన్న గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది.
✺ ఆ తర్వాత అందులో మూడు టీ స్పూన్ల ఓట్స్‌ పొడిని వేసుకోవాలి.
✺ ఇలా ఓట్స్‌ పొడిని వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి.
✺ ఇలా రెండింటిని మిశ్రమంలా తయారు చేయాలి.
✺ ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 
✺ ఆ తర్వాత 20 నిమిషాల పాటు అలానే ఉంచి, మసాజ్‌ చేయాల్సి ఉంటుంది.
✺ ఈ మిశ్రమం మొత్తం ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేయాలి.


Also Read: Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook