అదొక రద్దీ విమానాశ్రయం..అకస్మాతుగా అక్కడొక నెమలి కనిపించింది. విమానం ఎక్కడానికి టికెట్ కూడా తీసుకొనబోయింది. అయితే ఎయిర్ లైన్స్ సిబ్బంది వద్దని చెప్పింది. ఇదంతా వింటుంటే విడ్డూరంగా ఉంది కదూ..!!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికాలో ఒక మహిళా తనతోపాటు తన పెంపుడు జంతువు నెమలిని తీసుకెళ్దామని ఎయిర్ పోర్టుకు వచ్చింది. అయితే నెమలి సైజు పెద్దగా ఉండటంతో యునైటెడ్ ఎయిర్ లైన్స్  విమానంలో ఎక్కించుకోవడానికి నిరాకరించింది. నేను నెమలికి కూడా టికెట్టు తీసుకుంటా అని ఆ మహిళ సిబ్బందిని అడిగినా.. వారు అంగీకరించలేదట. అంతేనా 'ఎమోషనల్ సపోర్ట్ ఎనిమల్' నిబంధన ప్రకారం తన పెంపుడు జంతువును తీసుకెళ్లే హక్కు తనకుందని  వాదించిందట. అయినా అధికారులు అనుమతించలేదు.  


అమెరికాలో 'ఎమోషనల్ సపోర్ట్ ఎనిమల్' అని జంతువులను కొన్ని షరతులతో విమానంలో ప్రయాణించడానికి అనుమతిస్తారు. అయితే నెమలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే పెంపుడు జంతువులను విమానాల్లో అనుమతిస్తారు.


ఇటీవల న్యూజెర్సీలోని నీవార్క్‌ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. మహిళ, తన నెమలితో పాటు విమానాశ్రయానికి వచ్చిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి.