వెంకీ, తమన్నాల ఎంతో ఫన్ వీడియో సాంగ్
F2 మూవీ : ఎంతో ఫన్ వీడియో సాంగ్
విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ మొదటిసారిగా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ F2 ఈ సంక్రాంతి కానుకగా ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్స సాంగ్స్‌కి మంచి స్పందన లభించగా తాజాగా ఈ చిత్ర నిర్మాతలు ఎంతో ఫన్ అనే మరో వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. వెంకీ, వరుణ్ తేజ్ తోడు అల్లుళ్లు పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా నటించగా వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ ఫిర్జాద జంటగా నటించింది.