Erra Cheera Movie: భయపెడుతున్న `ఎర్రచీర` ట్రైలర్.. దిల్ రాజు ప్రశంసలు
Erra Cheera Movie Trailer: క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మూవీ ఎర్ర చీర మూవీ ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న థియేటర్లలో సందడి చేయనుంది. సుమన్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎన్‌వీవీ సుబ్బారెడ్డి నిర్మించారు.
Erra Cheera Movie Trailer: సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎర్ర చీర ట్రైలర్ వచ్చేసింది. మంగళవారం ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. చిత్రబృందాన్ని ప్రశంసించి.. ఆల్ ద బెస్ట్ చెప్పారు. శ్రీ పద్మాలయ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. సుమన్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్‌వీవీ సుబ్బారెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న ఆడియన్స్ ముందుకు రానుంది.
ఈ సందర్భంగా మూవీ మేకర్స్ మాట్లాడుతూ.. సినిమా అద్భుతంగా వచ్చిందని చెప్పారు. మూవీలో 45 నిమిషాల గ్రాఫిక్స్ హైలైట్‌గా నిలుస్తుందన్నారు. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబి సాయి తేజస్విని అద్భుతంగా యాక్ట్ చేసిందని తెలిపారు. కారుణ్య చౌదరి తన అందాలతో ఆడియన్స్ ఆకట్టుకుంటుందని అన్నారు. శ్రీరామ్, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , కమల్ కామరాజు, సాయి తేజస్విని, రఘుబాబు, ఆలీ, అన్నపూర్ణమ్మ, గీత సింగ్, సత్య కృష్ణ, మహేష్, భద్రం, జీవ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ప్రమోద్ పులిగార్ల మ్యూజిక్ అందించగా.. ఎస్.చిన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సినిమాటోగ్రాఫర్‌గా చందు పనిచేయగా.. ఎడిటింగ్ బాధ్యతలను వెంకట ప్రభు నిర్వర్తించారు.
==> దర్శకత్వం- సుమన్ బాబు
==> ప్రొడ్యూసర్- ఎన్‌వీవీ సుబ్బారెడ్డి
==> సినిమాటోగ్రాఫర్- చందు
==> లైన్ ప్రొడ్యూసర్- అబ్దుల్ రెహమాన్,
==> ఆర్ట్ - నాని, సుభాష్,
==> PRO- సురేష్ కొండేటి,
==> స్టంట్స్ - నందు,
==> డైలాగ్స్ - గోపి విమల పుత్ర,
==> ఎడిటర్ - వెంకట ప్రభు,
==> చీఫ్ కో డైరెక్టర్ - నవీన్ రామ నల్లం రెడ్డి, రాజ మోహన్.
Also read: Interview Tips: ఇంటర్వ్యూలో ఏయే పొరపాట్లు చేయకూడదు, ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలి
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి