అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన F2 మూవీ రూ.100 కోట్ల దిశగా బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన అనేక ఇతర సినిమాలతో పోటీపడిన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన కనిపించింది. దిల్ రాజు నిర్మించిన F2 మూవీలో వెంకీ సరసన తమన్నా భాటియా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ ఫిర్జాద జంటగా నటించారు. కడుపుబ్బా నవ్వించే కామెడి సినిమా అనే పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లు రాబడుతున్న ఈ సినిమాకు మరింత బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు చిత్ర నిర్మాత దిల్ రాజు. అందులో భాగంగానే తాజాగా F2 మూవీకి సంబంధించిన ఈ బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING