ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరో కొత్త ఫీచర్ తో తమ యూజర్ల ముందుకొచ్చింది. కమ్యూనిటీ యాక్షన్స్ పేరిట అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ ఫేస్‌బుక్ వేదికగా జరిగే క్యాంపెయిన్స్, ఈవెంట్స్, చర్చలకు మరింత ఊపిరి పోయనుంది. ఫేస్‌బుక్‌ యూజర్లు కమ్యూనిటీ యాక్షన్స్ బటన్ నొక్కి అక్కడ తమ పిటిషన్స్ నమోదు చేసే విధంగా ఈ ఫీచర్ ని ఏర్పాటు చేశారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ప్రభుత్వ సంస్థలు, అధికార యంత్రాంగానికి పలు సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు సూచనలు కూడా చేసే వెసులుబాటు ఉంటుంది. 


ఫేస్‌బుక్‌లో ఇవాళే అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్.. ప్రస్తుతానికి అమెరికాలోని ఫేస్‌బుక్‌ యూజర్లకు మాత్రమే పరిమితం కానున్నట్టు తెలుస్తోంది. ''ఓ మంచి ఆలోచనను ఫేస్‌బుక్‌లో నలుగురితో పంచుకుని, వారి నుంచి మద్దతు పొందేందుకు ఉపయోగపడటమే ఈ ఫీచర్ ముఖ్య ఉద్దేశం'' అని ఫేస్‌బుక్‌ స్పష్టంచేసింది.