ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమాలు అయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ బుధవారం రాత్రి మొరాయించాయి. ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ఖాతాదారుల ఎకౌంట్స్ పనిచేయలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన యూజర్స్ తమ ట్విటర్ ఖాతాల ద్వారా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. భారత్‌లో బుధవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో తొలుత ఫేస్‌బుక్ పనిచేయలేదు. ఆ తర్వాత కొద్దిక్షణాల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌ సైతం మొరాయించింది. అదే సమయంలో ఫేస్‌బుక్ మెస్సేంజర్ కూడా పనిచేయలేదు. 


విషయం తెలుసుకున్న సోషల్ మీడియా దిగ్గజం పేస్‌బుక్ వెంటనే స్పందించింది. తమ సాంకేతిక బృందం లోపాన్ని సరిదిద్దేపనిలో నిమగ్నమయ్యారని, వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం చేసేందుకు కృషిచేస్తున్నామని ఫేస్‌బుక్ ప్రకటించింది.