Faima Mother : ఫైమా, సత్యలు మారతారా?.. తల్లిదండ్రుల మాటలు వింటారా.. పెడచెవిన పెడతారా?
Faima Mother in Bigg Boss బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారం ఫ్యామిలీ టచ్ నడుస్తోంది. పదకొండు వారాలుగా ఇంటికి దూరంగా ఉన్న కంటెస్టెంట్లకు తమ తమ ఫ్యామిలీ మెంబర్ల టచ్ ఎలా ఉంటుందో చూపించాడు. ఇందులో భాగంగా నిన్న ఫైమా తల్లి బిగ్ బాస్ ఇంటికి వచ్చింది.
Faima Mother in Bigg Boss : బిగ్ బాస్ ఇంట్లోకి కంటెస్టెంట్ల తల్లిదండ్రులు రావడం అనేది ఓ స్పెషల్ మూమెంట్. అందరూ దాని కోసం కలగంటారు. తమ కుటుంబ సభ్యులు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చే వరకైనా ఎలిమినేట్ కాకుండా ఉండాలని కోరుకుంటారు. అయితే అది అందరికీ సాధ్యం కాదు. ఇక తల్లిదండ్రులో, వారి లైఫ్ పార్ట్నర్స్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాక.. తమ తమ ఆట తీరు గురించి సలహాలు ఇస్తుంటారు. తప్పులుంటే సరి చేసుకోమని సలహాలు ఇస్తుంటారు. అయితే వాటిని పాటిస్తారా? లేదా మళ్లీ కుక్క తోక వంకర అన్నట్టుగా ప్రవర్తిస్తారా? అన్నది సదరు కంటెస్టెంట్ల మీద ఆధారపడి ఉంటుంది.
గత సీజన్లో అయితే సిరిని ఇదే విషయంలో తెగ ట్రోల్స్ చేశారు. షన్ను నిన్ను అన్నలా చూసుకుంటున్నాడు అని ఓ మంచి రిలేషన్ పెట్టాలని సిరి వాళ్ల అమ్మ ట్రై చేసింది. కానీ సిరి మాత్రం కసురుకుంది. ఎక్కువగా హగ్గులు చేసుకోకు అని ఎంతో బుద్దిగా చెప్పింది. కానీ సిరి మాత్రం వినలేదు. అమ్మ చెప్పిన తరువాత మరింత ఎక్కువగా హగ్గులు చేసేసుకుంది. అదే ఆమెకు మరింతగా నెగెటివ్ అయింది. సిరి అంటే హగ్గులు, కిస్సులు తప్పా ఇంకేమీ ఉండదు అనేంతగా పేరు తెచ్చుకుంది.
ఈ ఆరో సీజన్లో అయితే ఎవ్వరూ అంతగా బరితెగించడం లేదు. మొదట్లో సత్యను చూసి అందరూ అమ్మాయి అంటే ఇలా ఉండాలనే అనుకున్నారు. ఎవ్వరు తాకినా నచ్చదని, దూరంగా ఉండండని ఇలా అర్జున్ కళ్యాణ్‌తో ఎన్నెన్నో మాటలు చెప్పింది. అన్నా అని పిలుస్తున్నా కూడా రేవంత్ తాకినా తనకు నచ్చదని చెప్పిన సత్య.. గత కొన్ని వారాల నుంచి శ్రీహాన్‌తో హద్దులు దాటేస్తోంది. చీ అనిపించేలా చేసుకుంటోంది. ఒళ్లంతా వెటకారం, వెక్కిరింతలు, శ్రీహాన్‌తో హగ్గులు, చెంపలు గిల్లడం వంటివి చేసి తన పరువు తానే తీసుకుంటోంది.
ఇదే విషయాన్ని నిన్నటి ఎపిసోడ్‌లో సత్య తండ్రి సుతిమెత్తంగా చెప్పాడు. మొదటి మూడు వారాలు సత్యలా ఉన్నావ్.. అందరికీ నచ్చావ్.. అలానే ఉండు.. ఇవన్నీ తిప్పడం ఏంటి.. ఆ వెటకారాలు ఏంటి? ఎక్కడ నేర్చుకున్నావ్.. నీకు అలవాటు లేదు కదా? అవన్నీ మనకు వద్దు అని సత్యకు బ్రెయిన్ వాష్ చేశాడు. మరి ఇకపై సత్య మునుపటిలా ఉంటుందా? లేదా మళ్లీ శ్రీహాన్‌తో కలిసి ఇలా రొమాన్స్ చేసుకుంటూనే ఉంటుందా? అన్నది చూడాలి. ఇప్పటికైనా సత్య తన వెటకారాన్ని, వెక్కిరింతలను తగ్గించుకుంటుందేమో చూడాలి.
ఫైమా విషయంలోనే ఇవే ఫిర్యాదులున్నాయి. ఆమె వెటకారం కాస్త తగ్గించుకుంటే మంచిది అనే విషయాన్ని నాగార్జున కూడా చెప్పాడు. అందుకే ఫైమా గత రెండు వారాల నుంచి కాస్త తగ్గింది. ఇలానే ఉంటాను అంటే జనాలకు ఏం చేయాలో తెలుసు అంటూ నాగార్జున ఇచ్చిన హింట్‌తో ఫైమా మారింది. వెటకారం తగ్గించింది. ఫైమా తల్లి కూడా కొన్ని సలహాలు ఇచ్చింది. సత్యను నమ్మకు.. దూరంగా ఉండు.. ఇనయతో మాట్లాడు కానీ ఎక్కువగా వద్దన్నట్టుగా చెప్పింది.. నీ వెటకారం తగ్గించుకో.. జనాలకు నచ్చడం లేదు అంటూ ఇలా చెప్పుకుంటూ పోయింది. మరి ఫైమా ఇప్పటికైనా తన అతిని తగ్గించుకుంటుందో లేదో చూడాలి.
Also Read : Raai Laxmi Bikini Pics : బికినీలో రత్తాలు.. రాయ్ లక్ష్మీ అందాల విందు.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook