రష్యాలో ప్రస్తుతం ఫిఫా ప్రపంచ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ లైవ్ టెలికాస్ట్ జరుగుతున్న సమయంలో.. . ఈవెంట్‌ను కవర్ చేయడానికి వచ్చిన కొలింబియన్ మహిళా జర్నలిస్టు జులియత్‌ను ఓ అభిమాని వచ్చి ముద్దు పెట్టుకొని అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు. ఈ వీడియోని సదరు జర్నలిస్టు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకోగా.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాను లైవ్ కవరేజి చేస్తూ మాట్లాడుతున్న సమయంలో.. ఓ గుర్తు తెలియని వ్యక్తి దగ్గరకొచ్చి ముద్దుపెట్టుకున్నాడని.. కానీ లైవ్ కాబట్టి తాను వెంటనే రియాక్ట్ కాలేకపోయానని సదరు మహిళా జర్నలిస్టు తెలిపింది. ఆ తర్వాత ఆ పని చేసిన వ్యక్తి గురించి గాలించామని.. కాకపోతే తాను దొరకలేదని ఆమె తెలిపింది. అయితే ఆ జర్నలిస్టును ముద్దు పెట్టుకున్న వ్యక్తిపై మండిపడుతున్నారు నెటిజన్లు.


అదేవిధంగా ఎవరో అనామకుడు వచ్చి తనను ముద్దు పెట్టుకున్నా.. జులియత్ రియాక్టవకుండా లైవ్ అప్డేట్స్ చెప్పడాన్ని ఆమె ప్రొఫెషనలిజానికి మచ్చుతునకగా చెప్పుకోవచ్చని అంటున్నారు కొందరు నెటిజన్లు. ఆమెను డిస్టర్బ్ చేయడానికి వచ్చిన ఫుట్ బాల్ అభిమానిపై కూడా విమర్శలు కురిపిస్తున్నారు.


ముఖ్యంగా భద్రతా దళాల వైఫల్యమే ఇలాంటి ఘటనలు జరగడానికి కారణమని కూడా అంటున్నారు. ముఖ్యంగా జర్నలిజం లాంటి రంగాల్లో రాణిస్తున్న మహిళలకు భద్రత కరువవుతుందని.. ఈ విషయంలో ప్రభుత్వాలు బాధ్యతతో వ్యవహరించాలని కూడా అంటున్నారు పలువురు నెటిజన్లు.