ప్రముఖ దర్శకురాలు, నిర్మాత, రచయిత కల్పనా లాజ్మి కన్నుమూశారు. ఆదివారం ఉదయం 4:30 గంటలకు ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 64 సంవత్సరాలు. కొన్నేళ్లుగా కిడ్ని క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో లాజ్మి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా కల్పనా లాజ్మి మృతికి సినీ ప్రముఖులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కల్పనా లాజ్మి పది సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆమె దర్శకత్వం వహించిన 'రుడాలి' చిత్రం సినీ విమర్శకుల ప్రశంసలు, అత్యంత ప్రజాదరణను పొందింది. 2006లో వచ్చిన చింగారి ఆమె దర్శకత్వం వహించిన చివరి చిత్రం. ఏక్ పల్, లోహిత్ కినారే, దర్మియాన్, డామన్, క్యోన్? తదితర చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు.