Tantra Movie Song: శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై తెరకెక్కిన మూవీ తంత్ర. అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నరేష్ బాబు పి, రవిచైతన్య నిర్మించారు. ఈ మూవీ నుంచి ధీరే ధీరే అంటూ సాగే ఫస్ట్‌ సాంగ్‌ను పాయల్ రాజ్‌పుత్, అనసూయ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీనివాస్ గోపిశెట్టి మాట్లాడుతూ.. గతంలో తాము విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. టీజర్‌కు కూడా అదిరిపోయే స్పందన వచ్చిందన్నారు. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చారని.. కాన్సెప్ట్‌గా డిఫరెంట్‌గా ఉందని మెచ్చుకోవడం తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. అతి త్వరలోనే ట్రైలర్‌ను కూడా లాంచ్‌ చేస్తామని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రైలర్‌లో మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు రివీల్ అవుతాయన్నారు. నిర్మాతలు నరేష్ బాబు, రవి చైతన్య ఎక్కడా వెనకడుగు వేయకుండా రిచ్‌గా సినిమాను నిర్మించారు. అడిగింది వెంటనే ఏర్పాటు చేసి చక్కగా సహకరించారని చెప్పారు. గతంలో ఎన్నో సూపర్ హిట్స్‌ పాటలు పాడిన అనురాగ్ కులకర్ణి.. ఈ సాంగ్‌ పాడడం ప్లస్ అయిందన్నారు. ఎంతో బిజీగా ఉన్నా.. అడిగిన వెంటనే సాంగ్‌ను లాంచ్ చేసిన పాయల్ రాజ్‌పుత్‌కు, అనసూయకు ధన్యవాదాలు తెలిపారు.  


నిర్మాతలు మాట్లాడుతూ.. ఫస్ట్-లుక్, టీజర్‌కి వస్తున్న ఆదరణ తమకు చాలా ఉత్సాహాన్నిచ్చిందని చెప్పారు. ఇలాగే తమ తంత్ర మూవీపైనా.. తమపైనా కూడా ఉండాలని.. సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సాంగ్ విడుదల చేసిన పాయల్ రాజ్‌పుత్, అనసూయకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. 


సాంకేతిక బృందం


==> రచన, డైరెక్షన్‌: శ్రీనివాస్ గోపిశెట్టి
==> బ్యానర్స్: ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరి
==> ప్రొడ్యూసర్స్: నరేష్ బాబు పి, రవి చైతన్య
==> సహ నిర్మాత: తేజ్ పల్లి
==> DOP: సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల
==> ఆర్ట్ డైరెక్టర్: గురుమురళీ కృష్ణ
==> ఎడిటర్ : ఎస్ బి ఉద్ధవ్
==> సంగీతం: ఆర్ఆర్ ధృవన్
==> సౌండ్ డిజైన్: జ్యోతి చేతియా
==> సౌండ్ మిక్సింగ్: శ్యామల్ సిక్దర్
==> వీఎఫ్‌ఎక్స్: ఎ నవీన్
==> DI కలరిస్ట్: PVB భూషణ్
==> సాహిత్యం: అలరాజు
==> PRO: మధు VR


Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు


Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook