హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావంతో అదానీ గ్రూప్ ఒక్కసారిగా కుదేలైంది. అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అదానీ సంపద కూడా భారీగా క్షీణించి..ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 20 నుంచి కూడా వైదొలగిన పరిస్థితి. ఈ నష్టాల్నించి కోలుకునేందుకు అదానీ గ్రూప్ కొత్త ప్లాన్ సిద్ధం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం గత కొద్దిరోజులుగా అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. అదానీ గ్రూప్ సంపద 100 బిలియన్ డాలర్లు క్షీణించింది. బ్లూమ్‌బర్గ్, ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా టాప్ 20 నుంచి కూడా వైదొలగిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యతిరేక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని..నష్టాల్నించి కోలుకునేందుకు అదానీ గ్రూప్ కొత్త స్ట్రాటెజీపై పనిచేస్తోందిప్పుడు.


అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమైన తరువాత కంపెనీ తన రెవిన్యూ గ్రోత్ టార్గెట్ తగ్గించింది. రెవిన్యూ గ్రోత్ టార్గెట్‌ను ఏకంగా 40 శాతం తగ్గించాలని నిర్ణయించింది. ఈ టార్గెట్‌ను సగానికి తగ్గించింది కంపెనీ. జనవరి 24వ తేదీన హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడటంతో కంపెనీ ఒక్కసారిగా తీవ్ర నష్టాల్లో పడిపోయింది. రోజూ గ్రూప్‌లోని కంపెనీలకు భారీగా నష్టం వాటిల్లింది. కంపెనీ మార్కెట్ వాటా ఇప్పటి వరకూ 117 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. 


హిండెన్‌బర్గ్ రిపోర్ట్ కల్గించిన నష్టాల్ని ఎదుర్కొనేందుకు కంపెనీ చాలారకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అదానీ గ్రూప్ సాధారణ ఆడిట్ నిర్వహించేందుకు బిగ్ ఫోర్ కంపెనీలైన డెలాయిట్, ఈవై, కేపీఎంజి, పీడబ్ల్యూసి ఎక్కౌంటింగ్ సంస్థల్లోంచి ఒక కంపెనీని నియమించుకునేందుకు యోచిస్తోంది. దాంతోపాటు న్యాయపరమైన పోరాటానికి సిద్ధమౌతోంది. ఇప్పటికే వాచ్‌టెల్ సంస్థను ఎంచుకుంది.


ఇవాళ కూడా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్ 2.89 శాతం పడిపోయి..1793.50 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. అదానీ పవర్ షేర్ 4.99 శాతం, అదానీ విల్మర్ 5 శాతం, అదానీ గ్రీన్ 5 శాతం క్షీణతతో ట్రేడ్ అవుతున్నాయి. అటు అదానీ ట్రాన్స్‌మిషన్ 5 శాతం, టోటల్ గ్యాస్ 5 శాతం పడిపోయాయి.


Also read: Tips to Buy Cars: కార్ల కొనుగోలుకు ముందు తప్పకుండా తెలుసుకోవల్సిన విషయాలివే, ఎందులో ఎక్కువ సౌకర్యం



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook